బెల్లంపల్లి, , (ఆంధ్రప్రభ) – బెల్లంపల్లి నియోజకవర్గం లో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షంతో తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకుంటూ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆరుకాలం కష్టపడి చేతికి వచ్చిన పంట వర్షం పాలు కావడంతో రైతులంతా గుండెలు బాదుకుంటున్నారు. ఎన్నో అప్పులు తెచ్చి పంట చేతికొచ్చాక ఆనందంగా ఉందామనుకుంటే ఈ అకాల వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది.
కురిసిన వర్షాలకు వడ్లు తడవడంతో వాటిని ఆరబెట్టుకుంటూ, మరి కొంతమంది రైతులు అందులోని నీటిని పారపోస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు తగిన న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.