Monday, November 25, 2024

సీఅండ్‌ఎండి సూచనల మేరకు సింగరేణి వ్యాప్తంగా కార్మికుల రక్షణకై చర్యలు

శ్రీరాంపూర్‌ : సీఅండ్‌ఎండి సూచనల మేరకు సింగరేణి వ్యాప్తంగా కార్మికుల రక్షణకై చర్యలు తీసుకుంటున్నామని డైరెక్టర్‌ పిఅండ్‌ పీపీ ఎన్‌.బలరాం పేర్కొన్నారు. శ్రీరాంపూర్‌ ఏరియాలోని ఉపరితల గనిపై కరోనా నివారణ చర్యల గురించి కార్మికులతో మాట్లాడారు. ఉద్యోగులను రక్షించేందుకు కావాల్సిన అన్ని సదుపాయాలను, సూచనలను కల్పిస్తున్నామన్నారు. సింగరేణి వ్యాప్తంగా ఉద్యోగులకు కావాల్సిన ఆక్సిజన్‌ నిల్వలు ఉన్నాయని, త్వరలోనే ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు సింగరేణి ముందుకు వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను ప్రతీఒక్కరు తప్పనిసరిగా పాటించాలని, దీని ద్వారా వారు, వారి కుటుంబసభ్యులు ఆరోగ్యవంతులుగా ఉంటారని తెలిపారు. సింగరేణి ఉద్యోగులు రక్షణలో భాగంగా ప్రతీ ఉద్యోగికి కరోనా వైరస్‌కు సంబంధించిన టెస్టులను చేయడం, వారి రక్షణ కోసం క్వారంటైన్‌ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, అలాగే ఉద్యోగులందరికి కరోనా వైరస్‌కు సంబంధించిన టీకాలను కూడా వేయిస్తామన్నారు. మే 31వ తేదీ వరకు ఉద్యోగులందరు కరోనా టీకా వేసుకోవాల్సిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జీఎం ఐఅండ్‌పిఎం రవిప్రసాద్‌, బెల్లంపల్లి రీజియన్‌ సేఫ్టీ జనరల్‌ మేనేజర్‌ బల్లారి శ్రీనివాస్‌, ఎస్‌ఓ-2 జీఎం గుప్త, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు సురేందర్‌ రెడ్డి, శ్రీరాంపూర్‌ ఉపరితల గని ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ (పీఓ) పురుషోత్తం రెడ్డి, గని మేనేజర్‌ జనార్దన్‌, డీజీఎం (సివిల్‌) శివరావు, టీబీజీకెఎస్‌ వైస్‌ ప్రెసిడెంట్లు అన్నయ్య, మంద మల్లారెడ్డి, గని ఫిట్‌ కార్యదర్శి పెంట శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement