కాసిపేట : చేయని నేరానికి బలి చేశారని, కుటుంబం గడవడం కష్టంగా వుంది, నన్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సహకార సంఘం మాజి ఉద్యోగి బద్రయ్య తన ఆవేదనను వ్యక్తం చేశాడు. కాసిపేట మండల కేంద్రంలో బద్రయ్య, తన కుటుంబ సభ్యులు.. విలేకరులతో మాట్లాడుతూ మండల కేంద్రంలని ధర్మారావుపేట ప్రాథమిక రైతు సహకార సంఘంలో ఏళ్లుగా విధులు నిర్వహించానని, అయితే 2014లో చైర్మన్‌గా వున్న వ్యక్తి సంగం డబ్బులు 15 లక్షలు కాజేయడం, కొద్ది రోజులకు చైర్మన్ చనిపోవడంతో నన్నుబాద్యుడిని చేస్తూ, విధుల నుండి సస్పండ్ చేసి 5 లక్షల రూపాయలు చెల్లించమంటే అప్పలు చేసి డిసివోకు డబ్బులు చెల్లించానని తెలిపారు. అయితే 5 లక్షలకు బదులుగా రెండు లక్షలకు మాత్రమే రిసిప్టు ఇచ్చాడని తెలిపాడు. మిగతా డబ్బుల సంగతి అడిగితే విషయం దాటవేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆరేల్లుగా ఉద్యోగం లేక కష్టాలు పడుతున్నామని మరల విధుల్లోకి తీసుకోవాలని, బకాయి వేతనాలు చెల్లించాలని వేడుకుంటున్న ప్రస్తుత పాలకవర్గం, అదికారులు పట్టించుకోవడం లేదన్నాడు. ఇప్పటికైనా నేను గతంలో చేసిన విధుల్లోకి తీసుకోవాలని, వేతన బకాయిలు చెల్లించాలని బద్రయ్య, అతని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement