Saturday, October 5, 2024

ADB: బాబోయ్ టైగర్.. అభయారణ్యంలో సంచరించిన పెద్దపులి..

ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అధికారులు
జన్నారం, ఆగస్టు 23 (ప్రభ న్యూస్): బాబోయ్ టైగర్.. మంచిర్యాల జిల్లా జన్నారం డివిజన్ కవ్వాల పులుల అభయారణ్యం అడవుల్లో పెద్దపులి సంచరిస్తుంది. ఈ మేరకు మంచిర్యాల డీఎఫ్ఓ శివ ఆశిష్ సింగ్, తాళ్లపేట రేంజ్ ఆఫీసర్ సుష్మారావు, ఇతర అధికారుల ఆధ్వర్యంలో అటవీ శాఖ అధికారులందరూ శుక్రవారం సాయంత్రం అడవులకు సమీపాన ఉన్న గ్రామాల్లో దండోరా వేయించారు. అడవుల్లో పెద్దపులి సంచరిస్తుందని పశువుల కాపరులు, సమీప గ్రామాల ప్రజలు అడవులకు వెళ్లకూడదని ప్రచారం చేశారు.

అడవిలోకి వెళ్ళిన ఓ పశువుల కాపరికి పెద్దపులి క‌నిపించినట్లు తెలిసింది. దీంతో అటవీ అధికారులంద‌రూ అప్రమత్తమయ్యారు. ఆ పెద్దపులి అడుగులను నిర్ధారించారు. గత వారం రోజుల క్రితం కొమురం భీం ఆసిఫాబాద్ అడవుల్లోని గుండాల అడవుల్లో పెద్దపులి సంచరించినట్లు ఈ మేరకు కవ్వాల అభయారణ్యంలోని అడవుల్లో పెద్దపులి అడుగులను గుర్తించినట్లు సమాచారం.

- Advertisement -

అడవుల్లోని జువ్విగూడ ప్రాంతంలో పశువులపై పులి దాడి చేసి గాయపరిచినట్లు తెలిసింది. ఈ విషయమై సాయంత్రం ఓ ఇద్దరు అటవీ అధికారుల‌ను సంప్రదించగా, పెద్దపులి సంచరిస్తున్నది వాస్తవమేనన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పెద్దపులి కదలికలను, నిర్దిష్ట ప్రదేశాన్ని తెలుపకూడదని నిబంధనలు ఉన్నాయని వారు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement