తరిగొప్పుల, (ఆంధ్రప్రభ)తరిగొప్పుల మండల కేంద్రంలోని స్థానిక బేడ బుడగ జంగాల కాలనీలో బుధవారం గుర్తుతెలియని జంతువు దాడిలో సుమారు 17 గొర్రెలు మృతి చెందాయి.
వివరాల్లోకి వెళితే మండల కేంద్రానికి చెందిన చెన్నూరి రమేష్ అనే రైతుకు చెందిన 80 గొర్రెలను మేపుకొని వచ్చి సాయంత్రం రోజువారీగా తన ఇంటి సమీపంలోని తన గొర్రెల దొడ్డిలో ఉంచి రాత్రి ఇంటికి వెళ్లారు. రాత్రి ఒంటిగంట సమయంలో ఎత్తైన వల లోపలకు గుర్తు తెలియని జంతువు చొరబడి దాడి చేసింది.
- Advertisement -
ఉదయం వచ్చి చూస్తే దొడ్డిలో తల్లి గొర్రెలు 10, గొర్రె పిల్లలు 7 దాడిలో మృత్యువాత పడి ఉన్నాయి. స్థానికులు హైన లేదా తోడేలు ఈ దాడి కి పాల్పడి ఉంటాయని చెబుతున్నారు. లక్షల్లో నష్టపోయామని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.