ఉట్నూర్, జనవరి 15 (ఆంధ్రప్రభ) : ఏ సమస్య ఉన్నా అడగడం మీ పని… చెప్పిన దానికి చేయడం అధికారుల, మా పని అని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బోజ్జు పటేల్ అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని త్వరలోనే అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రతిపక్ష పార్టీల మోసపూరిత మాటలను నమ్మవద్దని రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందన్నారు.
ఏ సమస్య ఉన్నా అధికారుల, పార్టీ నాయకుల దృష్టికి తీసుకువెళ్లాలని, కాని పక్షంలో తమ దృష్టికి తేవాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఎంపీడీవో రాంప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ అమృత్ లాల్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అబ్దుల్ ఖయ్యుం, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ లింగంపల్లి చంద్రయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్, జైనూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జయవంతరావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాధాబాయి, మాజీ ఎంపీటీసీ రాధాబాయి, మాజీ సర్పంచులు జగదీష్ జాదవ్, మర సూకోల తిరుపతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు లాజర్, అచ్చ దేవానంద్, రాజేష్ ఖలీం, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.