Saturday, November 23, 2024

ఆరోగ్య కేంద్రంలో వసతులు..

తాండూరు : ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సరైన వసతులు లేక కరోనా టెస్టుల కోసం, టీకా వేయించుకునేందుకు వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఆరోగ్య కేంద్రంలో సరైన వసతులు కల్పించాలని బిజెపి మండల పార్టీ అధ్యక్షులు రామగోని మహిధర్‌గౌడ్‌ అన్నారు. బిజెపి నాయకులతో కలిసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఆరోగ్య సిబ్బంది టెస్టుల కోసం వచ్చే వారికి టెస్టులు చేసి పాజిటీవ్‌ వచ్చిన వారిని ఐసోలేషన్‌లో ఉండాలని చేతులు దులుపుకుంటున్నారని, కనీసం మాస్కులు, శానిటైజర్‌, డెటాల్‌ కూడా కరోనా నిర్దారణ అయిన వ్యక్తులకు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. కొన్ని రకాల మందులు మాత్రమే ఇచ్చి మిగిలినవి ప్రైవేటు ఆసుపత్రుల్లో తీసుకోవాలని సూచిస్తున్నారని తెలిపారు. హోం ఐసోలేషన్‌లో ఉండే వ్యక్తులను ఆరోగ్య కార్యకర్తలు పర్యవేక్షించడం లేదని అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి కరోనా బాధితులతో పూర్తిస్థాయిలో హోం ఐసోలేషన్‌ కిట్స్‌తో చికిత్సను అందించాలని, ఆరోగ్య కేంద్రంలో కనీస వసతులు కల్పించాలని కోరారు. ఆయన వెంట రేవెల్లి రాజలింగు, సబ్బని రాజనర్సు, శ్రీనివాస్‌, విష్ణుకళ్యాణ్‌, భరత్‌, తుకారాం, భాస్కర్‌రెడ్డి, సాగర్‌, సంతోష్‌, సీతాలు తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement