మృతిచెందిన కార్మికుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్
కాసిపేట, జూన్ 3 (ప్రభ న్యూస్) : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం, దేవాపూర్ ఓసీసీ సిమెంట్ కంపెనీ గేట్ ముందు, కార్మికుడి మృత దేహంతో, కుటుంబ సభ్యులు, కార్మికులు ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, కంపనీ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.
వివరాలలోకి వెలితే, కంపెనీ వర్క్ షాప్ సేక్షన్ లో విధులు నిర్వహిస్తున్న మేకల రాజేష్ డ్యూటీలో వుండగా గత నెల 28న కోతులు అతనిపై దాడి చేయగా, పక్కన వున్న ఇనుప పైపులపై పడిపోయిన ప్రమాదంలో పక్కటెముకలు విరిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఆసుపత్రిలోనే గుండెపోటు రాగ, మంచిర్యాల నుండి మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్యులు రాజేష్ ను పరీక్షించి, అప్పటికే మృతి చెందినట్లు తెలిపారని అన్నారు.
సోమవారం ఉదయం మృతదేహంతో వచ్చిన అంబులెన్స్, కంపెనీ గేట్ ముందు పెట్టీ, రాజేష్ కుటుంబ సభ్యులు, కార్మికులు, రాజకీయ నాయకులు ఆందోళనకు దిగారు. దాంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కంపెనీ కార్మిక సంఘం నాయకులు తిరుపతి రెడ్డి, కంపెనీ అధికారి కులకర్ణితో చర్చలు జరిపారు. మృతుని కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా, డిపెండెంట్ కు ఉద్యోగం, దహన ఖర్చులకు రూ.25వేలు ఇచ్చేందుకు అంగీకరించారు. దాంతో ఆందోళన విరమించారు.