భారతీయ జనతా పార్టీ దళిత వ్యతిరేక పార్టీ అని రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమన్ ఆరోపించారు. బుధవారం తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. బీజేపీ ఎంపీలకు సిగ్గు లేదని, కేసీఆర్ ను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. అంబేద్కర్ ఆలోచనల మేరకు పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. గతంలో కాంగ్రెస్, బీజేపీలు 105 సార్లు రాజ్యాంగాన్ని సవరించాయని, కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలని అంటే రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారన్నారు. బడ్జెట్ నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను తెలంగాణలో ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..