బెల్లంపల్లి, : ఆరు నెలలుగా బెల్లంపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న భూ కబ్జాలపై సింగరేణి ఆసుపత్రి ముందు, ఎల్లమ్మ ఆలయం, ఇందిరమ్మ కాలనీలో, పాలిటెక్నిక్ కళాశాల ప్రాంతంలో, గ్రంథాలయ ఆవరణలో జరుగుతున్న అవినీతిపై న్యాయ విచారణ జరిపించాలని లిఖిత పూర్వకంగా సమాచారం ఇచ్చినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్రంగా ఖండించారు. బాలాజీ థియేటర్ ముందు టీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు చీకటి ఒప్పందంతో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవడం జరుగుతుందని, అధికారులు వెంటనే ఈ భూమిలో ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టాలని డిమాండ్ చేశారు. కన్నాల శివారు సర్వేనెంబర్ 60లో పూర్తిగా ప్రభుత్వభూమిలో 50 ఎకరాల ప్రభుత్వభూమిని మాగంటి అండ్ కోపై ఎలా ఎంట్రీ చేశారో, అసలు బెల్లంపల్లిలో లేని వారి పేరు మీద పట్టా చేసిన తహశిల్దార్‌పై చర్యలు తీసుకోవాలని, బూదకలాన్ శివారులో 944 ఎకరాల భూమిలో ఎలాంటి అసైన్ ఎంట్రీ సర్వే, బై నెంబర్లు లేని వ్యక్తుల నుండి ప్రభుత్వ భూమిని కాపాడాలని, ఆ ప్రాంతంలో ప్రభుత్వ సంస్థలు, నర్సరీలను ఏర్పాటు చేయాలని, వివాదాస్పద భూమిలో శాంతి భద్రతలు రాకుండా పోలీస్, రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు గెల్లి జయరాం, ఆడెపు మహేష్, బైరి శ్రీనివాస్, గుండేటి సదానందం, సంజయ్ శర్మ, గుండ మాణిక్యం, రత్నం రాజన్న, బొంకూరి రాంచందర్, స్వామిదాస్, బత్తుల మధు, మణిరాంసింగ్, అమానుల్లాసింగ్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement