నస్పూర్ : మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలంలోని ప్రభుత్వ భూమి అయిన సర్వేనెంబర్ 42లో అక్రమంగా నిర్మించుకున్న ఇండ్లను అధికారులు కూల్చివేశారు. మంచిర్యాల రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు పోలీసుల సహకారంతో నస్పూర్‌లోనీ ప్రభుత్వభూమిలో అక్రమంగా నిర్మించుకున్న ఇండ్లను కూల్చివేయడం జరిగింది. అనంతరం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ మురళీధర్ మాట్లాడుతూ ఆర్డీఓ ఆదేశాల మేరకు ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మించుకున్న సుమారు 11 ఇండ్లను కూల్చివేశామని, ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించుకున్న ఎలాంటి నిర్మాణాలనైనా తొలగించి ప్రభుత్వ స్వాధీనంలో ఉంచుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రెండు లేదా మూడు రోజులు కొనసాగుతుందని, మండల పరిధిలో ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించుకున్న ఎలాంటి కట్టడాలనైనా తొలగించి ప్రభుత్వ ఆధీనంలో ఉంచుతామని, ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వారిపై రెవెన్యూ చట్టం ప్రకారం తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆయన వెంట సర్వేయర్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement