Saturday, November 23, 2024

చట్టాలకు చెందిన కాగితాలు దహనం..

కాసిపేట: కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఏఐటీయూసి నాయకులు డిమాండ్‌ చేశారు. మందమర్రి ఏరియా కాసిపేట గనిపై కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న కార్మిక వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ఏఐటియూసీ ఆధ్వర్యంలో నాయకులు, కార్మికులు నిరసనలు తెలియచేశారు. ఈ సంధర్భంగా బెల్లంపల్లి బ్రాంచి ఉపాధ్యక్షుడు, గని ఫిట్‌ కార్యధర్శి వెంకటస్వామి మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న మోడి ప్రభుత్వం రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నదన్నారు. వ్యవసాయ రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం ఆందోలన చేస్తున్న పట్టించుకోవడం లేదని విమర్శించారు.మరో వైపు 44 కార్మిక చట్టాలను కుదించి 4 చట్టాలుగా తీసుకువచ్చి కార్మిక హక్కులు, కార్మిక సంఘాల ఉనికికి ప్రమాదకరమైన విదానాలను అమలు చేయాలనే కుట్రలు చేస్తన్నదని ఆరోపించారు. నూతన చట్టాలను ఏప్రిల్‌ ఒకటి నుండి అమలుకు ప్రయత్నాలు చేస్తున్నదని పేర్కోన్నారు. ఇలాంటి కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేసేవరకు చేసే ఆందోళన కార్యక్రమాలకు కార్మికులు మద్దతు పలకాలని కోరారు. అనంతరం నూతన కార్మిక చట్టాల ప్రతులను మంటల్లో దహనం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మీనుగు లక్ష్మినారాయణ,రాములు, నర్సయ్య, కార్మికులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement