Sunday, October 6, 2024

TG | మా బతుకులు కూల్చొద్దు…. ఇంద్రవెల్లిలో గిరిజనేతరుల ఆందోళన

ఆంధ్రప్రభ స్మార్ట్, ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో అనుమతి లేని నివాస గృహాల కూల్చివేత వివాదం మరింత ముదిరింది. అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో కూల్చివేయడంపై ఆదివారం సైతం గిరిజనేతరులు ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరవదిక దీక్షలకు పూనుకున్నారు.

ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల హక్కులకు భంగం వాటిల్లకుండా దశాబ్దాల తరబడి కలిసిమెలిసి జీవిస్తున్నామని, అధికారులు ఇప్పుడు ఆదివాసి చట్టాల పేరిట ఇళ్లు తొలగించడం దారుణమన్నారు. అధికారులు ఏజెన్సీలో అశాంతిని ప్రేరేపిస్తూ.. ఇది వర్గాల మధ్య చిచ్చు పెడుతున్నారని గిరిజనేత రా ఐక్యవేదిక నాయకులు ఆరోపించారు. రెండో రోజు కూడా స్వచ్ఛందంగా దుకాణాలు, వ్యాపార సంస్థలు, హోటళ్ళు మూసివేసి నిరసన తెలిపారు.

8న ఏజెన్సీ బందు పిలుపు

ఏజెన్సీలో హైడ్రా తరహాలో అధికారులు గిరిజనేతరుల ఇండ్లను కూల్చివేయడంపై నిరసిస్తూ ఉట్లూర్ ఏజెన్సీ పరిధిలోని మండలాల్లో 8న బంద్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్ని దుకాణాలు వ్యాపార సంస్థలు మూసివేసి ప్రభుత్వానికి నిరసన తెలపాలని తీర్మానించారు.

అధికారులు మా బతుకులు కూల్చోద్దంటూ నినాదాలు చేశారు. గిరిజనేతర ఐక్యవేదిక నాయకులు సమావేశమై సంఘీభావం తెలిపారు. అవసరమైతే ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. గుడియత్నూర్ ఇచ్చోడ ఉట్నూర్,ఇంద్రవెల్లి లో సుమారు 30 మందికి డిప్యూటీ సబ్ కలెక్టర్ నోటీసులు జారీ చేయడం కలకలం రేపింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement