ఉట్నూర్ జూన్21(ప్రభన్యూస్) తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపెళ్లి జయశంకర్ సార్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ అన్నారు. బుధవారం జయశంకర్ సార్ వర్ధంతి వేడుకలను గంగన్నపేట లోని జయశంకర్ సార్ చౌక్ లో నిర్వహించారు. జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జయశంకర్ సార్ ఎంతో తప్పించారని ఆయన చేసిన కృషి మరువలేని అన్నారు ఆయన ఆశయ సాధనకు అనుగుణంగా అందరూ కృషి చేద్దామని జడ్పీ చైర్మన్ అన్నారు ఈ కార్యక్రమంలో జీవవైవిద్య మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు మర్చిపోల తిరుపతి ఉట్నూర్ మాజీ వైస్ ఎంపీపీ సలీం నాయకులు రమేష్ కరీం, అబుజర్, శ్రీకాంత్ రాజు, ఆత్రం లక్ష్మణ్, హేమయ, రాజలింగు, రామచందర్ తదితరులు పాల్గొన్నారు.