Wednesday, September 25, 2024

Adialabad – వినండి సారూ .. గోట్కూరి బడి గోడు

పంతుళ్లు లేక పరేషాన్​
53 మంది పిల్లలకు ఒక్కరే ఉపాధ్యాయురాలు
టీచర్​ సెలవు పెడితే బడిమూతే

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోనీ గొట్కూరి ప్రాథమిక పాఠశాలలో సరిపోను ఉపాధ్యాయులు లేక చదువులు ముందుకు సాగడం లేదు. ఇక్కడ 53 మంది విద్యార్థులకు ఒకే ఒక్క టీచర్ రోజారాణి విధులు నిర్వహిస్తున్నారు. ఐదు తరగతులకు చెందిన పిల్లలందరినీ ఒకేచోట చేర్చి పాఠాలు బోధిస్తున్నారు. పిల్లలందరికీ అటెండెన్స్, మధ్యాహ్న భోజనం, బిల్లుల తయారీ అదనపు బాధ్యతలన్నీ ఆ టీచరే చూసుకుంటుంది. ఆమె అత్యవసరంగా సెలవు పెడితే ఆ రోజు బడి మూతపడుతుంది. గొట్కూరి గ్రామస్తులు సైతం తమ పిల్లల భవిష్యత్తుపై ఆలోచించి మ‌రో టీచ‌ర్‌ను నియ‌మించాల‌ని అధికారులను కలిసినా పట్టించుకోవడంలేదని వాపోయారు. బడికి తాళం వేసి కలెక్టర్ ని కలిసి విన్నవిస్తామని గ్రామస్తులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement