భీమిని: భీమిని మండల కేంద్రంలోని విద్యుత్ ఉప కేంద్రాన్ని బెల్లంపల్లి ఏడీఈ శ్రీనివాస్ పరిశీలించారు. ఉప కేంద్రంలో ఉన్న సమస్యలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కల్గకుండా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. మండలంలో ఎక్కడ విద్యుత్ సమస్య తలెత్తినా వెంటనే స్పందించాలని, వినియోగదారులకు అందుబాటులో ఉంటూ సహకరించాలని, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌దారులకు విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని, అక్రమంగా ఎవరు విద్యుత్‌ను వినియోగించినా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని, వ్యవసాయ విద్యుత్ కోసం రైతులు ఎవరు అక్రమ విద్యుత్‌ను వాడవద్దని, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌ను
ఇప్పుడు పొందడం చాలా సులభతరమైందని అన్నారు. ఏడీఈ వెంట లైన్ ఇన్‌స్పెక్టర్లు వెంకన్న, రమణారెడ్డి, లైన్‌మెన్లు సాగర్, ఇంతియాజ్ అహ్మద్, సిబ్బంది ఉన్నారు.
విద్యుత్ ఉపకేంద్రాన్ని పరిశీలించిన ఏడీఈ
Advertisement
తాజా వార్తలు
Advertisement