జన్నారం, (ఆంధ్రప్రభ): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కవ్వాల పులుల అభయారణ్యంలోని జన్నారం రేంజ్ పరిధిలోని అల్లీనగర్ ఫారెస్ట్ సెక్షన్ అధికారి కిరణ్మయి జ్యోతి విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ నెల 9వ తేదీన అల్లీనగర్ గ్రామానికి చెందిన ఆత్రం నగేష్ ఇంట్లో ముందస్తు సమాచారం మేరకు రూ.54 వేల విలువైన అక్రమ టేకు కలపను స్వాధీనం చేసుకున్నారు.
ఈ అక్రమ కలపను పట్టుకున్న వ్యవహారంలో ఆ సెక్షన్ అధికారి అధికారి కిరణ్ మైజ్యోతిపై పలు ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని మంచిర్యాల ఫ్లయింగ్ స్క్వాడ్ రేంజ్ అధికారిణి రమాదేవిని ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగా సెక్షన్ అధికారిని సస్పెండ్ చేసినట్లు డీఎఫ్‌వో, స్థానిక ఇన్‌ఛార్జ్ ఎఫ్‌డీవో శివ ఆశిష్ సింగ్ గురువారం సాయంత్రం తెలిపారు.