సారంగాపూర్, (ఆంధ్రప్రభ ) : దిల్వార్‌పూర్ మండల పరిధిలోని కాల్వ అటవీ ప్రాంతంలో ఇద్దరు భార్యాభర్తలు ఉరివేసుకుని మృతి చెందిన ఘటన ప్రజలను కలచివేసింది. కాల్వ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం సమీపంలోని అటవీ ప్రాంతంలో రంగాపూర్ మండలం చించోలివి గ్రామానికి చెందిన భార్యాభర్తలు మృతి చెందారు.
మృతురాలు గత రెండు రోజుల క్రతం ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చించాడు గ్రామానికి చెందిన భాస్కర్‌రెడ్డి, అనసూయ దంపతులుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.