Thursday, November 21, 2024

ADB | విద్యార్థులు లక్ష్యాన్ని నిర్ణయించుకొని చదువుకోవాలి : విద్యాధికారి యాదయ్య

జన్నారం, (ఆంధ్రప్రభ): విద్యార్థులు లక్ష్యాన్ని నిర్ణయించుకొని చదువుకోవాలని జిల్లా విద్యాధికారి యాదయ్య అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కలమడుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోషకుల, ఉపాధ్యాయుల సమావేశం గురువారం నిర్వహించారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ…. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తారన్నారు. విద్యార్థులు దేనికి భయపడకుండా అన్ని రంగాల్లో ముందుండి తమ లక్ష్యాన్ని సాధించుకోవాలని ఆయన సూచించారు.

విద్యార్థులు రానున్న పదవ తరగతిని దృష్టిలో ఉంచుకొని ప్రణాళిక బద్దంగా చదువుకోవాలని, అలాంటప్పుడే మంచి ఫలితాలు వస్తాయని ఆయన చెప్పారు. పాఠ్య ప్రణాళికకు అనుగుణంగా విద్యార్థులు చదువుకోవాలని, చదువే అన్నిటికీ మూల కారణమని, చక్కగా చదువుకొని ప్రతి ఒక్కరు పైకి రావాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల హెచ్.ఎం కట్ట రాజమౌళి, స్థానిక తహసిల్దార్ సి.రాజమహారెడ్డి, ఎంఈఓ విజయకుమార్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement