Friday, October 18, 2024

Adb: ముధోల్ మార్కెట్ యార్డు , గోదాంకు స్థలం కేటాయించండి

ముధోల్ రైతు సంక్షేమ సంఘం

ముధోల్ ప్రతినిధి, అక్టోబర్ 14,( ఆంధ్రప్రభ )

ముధోల్ రైతులకి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు , గోదాం సమస్యల శాశ్వత పరిష్కారానికి స్థలం కేటాయించాలని తహశీల్దార్ శ్రీకాంత్ కు ముధోల్ రైతు సంక్షేమ సంఘం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ముధోల్ రైతు సంక్షేమ సంఘం సభ్యులు మాట్లాడుతూ… వ్యవసాయ సహకార సంఘానికి స్థల కేటాయింపు ద్వారా గోదాం నిర్మించుటకు మార్గం సుగమమై రైతులకు మేలు జరిగుతోందన్నారు. ఉమ్మడి జిల్లాలో అత్యధిక సొయా సాగుభూమి ముధోల్ తాలూకా కేంద్ర పరిసరాల్లో ఉన్న దృష్ట్యా , అలాగే ముధోల్ , తానూర్ , బాసర , లోకేశ్వరం నాలుగు మండలాలకు భౌగోళికంగా ముధోల్ కేంద్ర బిందువుగా ఉండటం వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఏర్పాటుకు అనుకూలమని పేర్కొన్నారు. దళారుల బారిన పడి రైతులు నష్టపోకుండా ఉండేందుకు రైతుల దశాబ్దాల డిమాండ్ కూడా నెరవేరే అవకాశమని తెలియజేసారు. నూతన వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు ప్రాధాన్యతను గ్రహించిన తహసీల్దార్ తప్పకుండ రైతులకు మేలుకొ రకు స్థలాన్ని కేటాయించేవిషయమై పరిశీలన చేస్తామని సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అయేషా అఫ్రోజ్ ఖాన్ , గ్రామ సంఘ అధ్యక్షులు గుంజాల నారాయణ , క్యాషియర్ సాయినాథ్ మేత్రి , మాజీ సర్పంచ్ రాజేందర్ వెంటాపూర్ , వందేమాతరం, జాదవ్ సాయినాథ్ పాటిల్ , యువ రైతులు బొడ్డోల్ల శివాజీ , గుడ్లోల్ల దేవేందర్ , గోపి , రాజేష్ జాదవ్ , పోతన్న , శంకర్ లు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement