Friday, September 20, 2024

ADB | క‌ల్వాల అభయార‌ణ్యంలో అక్రమంగా ఉన్న 10మంది అరెస్ట్ !

జన్నారం, (ప్రభ న్యూస్) : మంచిర్యాల జిల్లా కవ్వాల అభయారణ్యంలోని అడవుల్లో అక్రమంగా నివాసముంటున్న పదిమందిపై అటవీ అధికారులు (శుక్రవారం) సాయంత్రం అరెస్టు చేశారు. కవ్వాల పులుల అభయారాణ్యంలోని జన్నారం డివిజన్ ఇందనపల్లి రేంజ్ కంపార్ట్ మెంట్ నెం.249 అడవిలో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన 10 మంది అక్రమంగా చొరబడి నెల రోజులుగా అక్కడే ఉంటున్నారు. దీంతో వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఇందనపల్లి రేంజ్ అధికారి ఎండీ హఫీజుద్దీన్ తెలిపారు.

కవ్వాల అటవీ ప్రాంతంలో గత నెల రోజులుగా పులి సంచరిస్తోందని, వన్యప్రాణులకు ఎలాంటి హాని జరగకుండా చర్యలు తీసుకుంటున్న క్రమంలో… అడవిలో అక్రమంగా ఉంటున్న కుమ్రం లక్ష్మణ్, సిడాం మోతిరాం, మేస్రం గంగారాం, నైతం మాన్కు, తోడసం విష్ణు, సిడం బాలు, ఆత్రం లాల్ సావ్, పెందోర్ సురేబాన్, పెందోర్ జలపతిరావు, కనక చంద్రబాన్ లను అరెస్ట్ చేసి లక్షెట్టిపేట కోర్టులో హాజరు పర్చినట్లు ఆయన చెప్పారు. నిందితులను సెక్షన్, బిట్ ఆఫీసర్లు కృష్ణారావు, అమృతరావ్ తదితరులు పట్టుకున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement