Friday, November 8, 2024

ADB : భూకబ్జాలపై ఆరోపణలు వస్తే సహించేది లేదు : గడ్డం వినోద్

  • 70 సంవత్సరాల్లో మా కుటుంబం ప్రజలను ఇబ్బంది పెట్టలే
  • ప్రజలు ఇచ్చిన తీర్పుకు కట్టుబడి ఉన్నాం.

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తనపై ఆరోపణలను ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఖండించారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కబ్జాలు జరిగాయ.. గాని తమ ప్రభుత్వంలో కబ్జాలకు తావు లేదన్నారు. గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే అనుచరులు కబ్జాలకు, బెదిరింపులకు పాల్పడుతున్నారని ప్రచారం జరుగుతుందని ఇలాంటి ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని తెలిపారు. అధికార పార్టీకి చెందిన ఎవరైనా కబ్జాలకు, బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదని, తన దృష్టికి తీసుకువస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.

తన కుటుంబం 70 సంవత్సరాల నుండి ప్రజలకు ఇబ్బందులు పెట్టలేదని, ప్రజలు ఇచ్చిన తీర్పుకు కట్టుబడి ఉంటామన్నారు. తాను తన కుటుంబం రాముల వారి గుడి వద్ద ప్రజల ముందే మాట ఇచ్చామని తెలిపారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలకు తావుండదన్నారు. తాను నియోజకవర్గంలో సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధిపై డిసెంబర్ 7న కరపత్రం విడుదల చేస్తానన్నారు. అధికార పార్టీ నాయకులు, అధికారులు ఎవరైనా అవినీతికి పాల్పడినట్లు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, తన జీవితంలో మచ్చలేని నాయకుడుగా పనిచేస్తానన్నారు.

కబ్జాలపై ప్రత్యేక దృష్టి సారించాం… జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
బెల్లంపల్లి పట్టణంలో కబ్జాలపై ప్రత్యేక దృష్టి సారించామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బెల్లంపల్లిలో కొన్ని ప్రచారాలు కూడా చేస్తున్నారని, ఎవరైనా కబ్జాకు పాల్పడినట్లు తెలిస్తే వెంటనే నాకు తెలియజేయాలని పేర్కొన్నారు. గతంలో కొందరు తమకు తెలిపిన ఫిర్యాదులపై స్పందించడం జరిగిందని, ఎంతటి వారైనా ఆక్రమాలకు పాల్పడితే సహించేది లేదని తెలిపారు.

- Advertisement -

కబ్జాలపై ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసాం… ఆర్డీవో హరికృష్ణ
బెల్లంపల్లిలో జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి కూల్చివేతలు చేయడం జరిగిందని, మండలంలోని 3 పైకి స్థలంలో ప్రభుత్వ బోర్డు ఏర్పాటు చేయడం జరిగిందని, కన్నాల గ్రామ పంచాయతీలో, కన్నాల బస్తీలోని అక్రమాలను తీసివేయడం జరిగిందని, కబ్జాల కోసం ప్రత్యేక టీమును ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత శ్రీధర్, మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమరి సూరిబాబు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ముచ్చర్ల మల్లయ్య, నాయకులు మునిమంద రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement