Friday, November 22, 2024

అభివృద్ది సంక్షేమం సింగరేణి లక్ష్యం..

కాసిపేట : సంస్థ అభివృద్ది, కార్మికుల సంక్షేమం సింగరేణి లక్ష్యమని మందమర్రి ఏరియా జియం చింతల శ్రీనివాస్‌ పేర్కోన్నాడు. కాసిపేటగనిపై ఏర్పాటు చేసిన సమావేశంలో జీఎం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అవిర్భావం తర్వాత ప్రభుత్వ సహాకారంతో పలు రంగాల్లో సింగరేణి అభివృద్ది పథాన ముందుకు సాగుతున్నదన్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని ఆరు జిల్లాల్లో సుమారు 11 395 మిలియన్‌ టన్నుల బొగ్గు నిక్షేపాలున్నట్టు గుర్తించగా ఇప్పటి వరకు దాదాపు 1 543 మిలియన్‌ టన్నుల బొగ్గును మాత్రమే ఉత్పత్తిని తీసినట్టు తెలిపారు. ఒరిస్పా రాష్ట్రంలో సైతం బొగ్గు బ్లాకుల నుండి బొగ్గును ఉత్పత్తి తీయడానికి అన్ని అనుమతులు వచ్చినట్టు పేర్కొన్నారు. బొగ్గు ఉత్పత్తితో పాటు థర్మల్‌ విధ్యుత్‌, పర్యావరణ హితంగా, వ్యాపార విస్తరణలో భాగంగా సింగరేణి 300 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ నెలకొల్పి కరెంట్‌ ఉత్పత్తిని తీసేందుకు ప్రణాళికలు తయారు చేసినట్టు వివరించారు. ఇలా అనేక రంగాల్లో అభివృద్దికి పాటుపడుతూనే మరో వైపు కార్మికుల సంక్షేమం, రక్షణ పట్ల అంతే బాధ్యతతో పని చేస్తన్నదని తెలిపాడు. ఏ కంపేనీలో, సంస్థలో లేని విధంగా సింగరేణి ఆర్జించిన వార్షిక లాభాల్లో వాటా శాతాన్ని కార్మికులకు అందిస్తున్న ఏకైక సంస్థ అని, కారుణ్య నియమాల ద్వారా 10 700 మందికి డిపెండెంట్‌లకు ఉద్యోగ కల్పన, కార్మిక వాడల్లో అభివృద్ది పనులు, నివాసాలరు, ఏసీలకు ఉచిత కరెంట్‌, మెరుగైనా వైధ్యం ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలతో గనుల్లో పని స్థలాల యందు రక్షణ చర్యలు, ప్రమాద రహిత బొగ్గు ఉత్పత్తి లక్షాల సాధనకు యాజమాన్యం చిత్తశుద్దితో పని చేస్తున్నదని వివరించాడు.

70 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్షం..
ఈ ఏడాది 2021-22కి యాజమాన్యం 70 మిలియన్‌ టన్నుల బొగ్గు
ఉత్పత్తిని సాధించాలనే లక్షాన్ని నిర్ణయించిందని తెలిపాడు. గత ఏడాది కరోన నేపద్యంలో అనుకున్న బొగ్గు టార్గెట్‌ సాధించలేక పోయామని, ఈ సంవత్సరం మాత్రం అనుకున్న లక్షం సాధనకు కార్మికులు, అధికారులు, సూపర్‌ వైజర్లు సమైక్యంగా పాటుపడాలని సూచించాడు. ఈ కార్యక్రమంలో కాసిపేట గ్రూప్‌ ఏజెంట్‌ రాజేందర్‌, గని మెనేజర్‌ భూ శంకరయ్య, డివై మెనేజర్‌ అల్లావుద్దిన్‌, గుర్తింపు సంఘం నాయకులు మేడ సమ్మయ్య, దుగుట శ్రీనివాస్‌, ప్రాతినిద్య సంఘం నాయకులు మిట్టపెల్లి వెంకటస్వామి, దాగం మల్లేష్‌, బియ్యాల వెంకటస్వామి, గని అదికారులు, కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement