Saturday, June 29, 2024

ADB: నూతన జిల్లా కలెక్టర్ కు ఘన స్వాగతం..

నిర్మల్ ప్రతినిధి, జూన్ 20 (ప్రభ న్యూస్) నిర్మల్ జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన అభిలాష అభినవ్ (ఐఎఏస్) కు ఘ‌న‌స్వాగతం పలుకుతూ ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో తేనేటి విందు కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశారు. ఇవాళ‌ జిల్లా క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, జడ్జి లకు, సీనియర్ పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల (ఐపిఎస్), తేనేటి విందు, అల్పాహారం కార్యక్రమం ఏర్పాటు చేశారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా స్థితిగతుల గురించి, లా అండ్ ఆర్డర్ విషయాల మీద ముచ్చటించారు. జిల్లాలో ప్రస్తుత శాంతిభద్రతల గురించి పోలీస్ ఉన్నతాధికారులను, అధికారులను ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసులు లా అండ్ ఆర్డర్ నిర్వహణలో సమర్థవంతంగా ఉన్నారని, రెవెన్యూ శాఖ జుడీషియరీకి శాఖలు సమర్ధంగా పనిచేసినప్పుడే సరైన సత్ఫలితాలు వస్తాయన్నారు.

ఈ సందర్భంగా నూతన కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లా ప్రశాంతంగా ఉంటేనే ఆ జిల్లా అభివృద్ధి పథంలో ఉంటుందన్నారు. అందుకోసం ఎల్లప్పుడూ పోలీసు శాఖకు త‌మ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, ఎల్లప్పుడూ ఫోన్ లో అందుబాటులో ఉంటూ తగిన తోడ్పాటు కల్పిస్తామని తెలియజేసారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జిలు జి.రాధిక. జె.భవిష్య, ఆర్.అజయ్ కుమార్, నిర్మల్ డిఎస్పి గంగారెడ్డి, పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్, గ్రామీణ సిఐ శ్రీనివాస్, సొన్ సీఐ నవీన్ కుమార్, ఖానాపూర్ సిఐ సైదారావు, ముదోల్ సిఐ మల్లేష్, బైంసా రూరల్ సిఐ నైలు, బైంసా పట్టణ సీఐ రాజారెడ్డి, డిసియర్బి సీఐ గోపీనాథ్, ఆర్ఐలు శైలేందర్, రామ్ నిరంజన్, రామకృష్ణ, డీపీఓ సూపరిండెంట్ శ్రీనివాస్ ఆర్ఎస్ఐలు, కలెక్టర్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement