Wednesday, November 20, 2024

Investigate| కవ్వాలలో ఖనిజ నిక్షేపాలు.. విదేశీ బృందం పరిశోధన

జన్నారం, ఆంధ్రప్రభ: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల అభయారణ్యంలోని ఖనిజాలు, శిలల పరిశోధన కోసం స్లొవెకియా విద్యార్థుల బృందం ఆదివారం పర్యటించింది. కర్నాటకలోని బెంగళూరుకు చెందిన ప్రముఖ భూగోళ ఖనిజ ,శిలల శాస్త్రవేత్త, డైరెక్టరు మంజుషా మహాజన్ ఆధ్వర్యంలో ఆ దేశ బృందం ఉదయం సఫారీ వాహనాల్లో అభయారణ్యంలోని గొండుగూడ, బైసన్ కుంట, మల్యాలలోని వాచ్ టవరు పరిసర ప్రాంతాలకు వెళ్లింది.

- Advertisement -

అక్క‌డికి చేరుకొని అట‌వీ అందాలను తిలకించారు. ఆయా ప్రాంతాల్లోని చెట్లు, గుట్టలను, ఇతర ప్రదేశాల్లోని ఖనిజాలు, శిలలను పరిశీలించారు. ఓ పెద్దచెట్టు అందాలను చూసి ఆ బృందం సభ్యులు ఎంతో మురిసిపోయారు. ఈ సందర్భంగా అడవుల అందాలను చూసి వారందరూ పర్వశించిపోయారు. వారి వెంట స్థానిక ఇన్‌చార్జి రేంజ్ ఆఫీసర్ సుష్మారావు, ఫారెస్ట్ సెక్షన్, బీట్ ఆఫీసర్లు నహీదపర్వీన్, ఎస్.శ్రీనివాస్, కృష్ణమూర్తి, తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement