Tuesday, November 26, 2024

ADB | ఎస్బీఐ బ్యాంకు ప్రైవేటు ఉద్యోగిపై కేసు నమోదు….

జన్నార, (ప్రభ న్యూస్): మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని ఎస్బీఐలో దినసరి ఉద్యోగి ఎఫ్.ఓ.ఎస్. పి.సాయిరాంపై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్ ఎస్ రాజవర్ధన్ శుక్రవారం తెలిపారు. పంట రుణమాఫీ విషయంలో మండలంలోని కవ్వాల హాస్టల్‌కు చెందిన రైతు ఎర్రయ్య నుంచి రూ.15వేలు లంచం తీసుకున్నట్లు రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయ‌న‌ తెలిపారు.

సాయిరామ్ పై సస్పెన్షన్ వేటు

ఎస్బీఐలో ప్రైవేట్ ఉద్యోగి ఎఫ్.ఓ.ఎస్. పి.సాయికుమార్ పై ఎస్బీఐ శాఖ మంచర్యాల రీజనల్ మేనేజర్ రితీష్ కుమార్ విచారణ చేపట్టారు. పలువురు రైతులు, బ్యాంకు ఉద్యోగులను అడిగి వాస్తవాలను తెలుసుకున్నారు. కాగా, సాయిరామ్ ను సస్పెండ్ చేసినట్లు స్థానిక ఎస్బీఐ మేనేజర్ మహేష్ తెలిపారు. హాస్టల్ తండా రైతు ఎర్రయ్య నుంచి రూ.15వేలు లంచం తీసుకున్నాడనే ఆరోపణల మేరకు మంచిర్యాల రీజినల్ మేనేజర్ రితీష్ కుమార్… సాయిరామ్ ను సస్పెండ్ చేసినట్లు ఆయన చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement