Friday, November 22, 2024

ADB | టేకు చెట్లు నరికిన ఒకరి బైండోవర్

జన్నారం, నవంబర్ 22( ఆంధ్రప్రభ) : అక్రమంగా టేకు చెట్లు నరికిన మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని బాదంపల్లికి చెందిన జాడి రాజంను స్థానిక తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు జన్నారం ఇన్చార్జి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుష్మారావు శుక్రవారం తెలిపారు.

నిందితుడైన రాజం అక్రమంగా టేకు చెట్లను నరుకుతూ, రవాణా చేస్తున్నారనే అభియోగం మేరకు తమ ఫారెస్ట్ సెక్షన్, బీట్ ఆఫీసర్లు మధుకర్, తన్వీర్ పాషా, ఎస్.శ్రీనివాస్ లు అదుపులోకి తీసుకొని స్థానిక తహసీల్దార్ రాజ మనోహర్ రెడ్డి ఎదుట బెండోవర్ చేశారన్నారు. అనంతరం రూ.25వేల పూచికత్తు ను రాజం నుంచి తీసుకొని పంపివేశారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement