రెబ్బెన, (ప్రభ న్యూస్) రెబ్బెన మండలంలోని జక్కులపల్లి గ్రామంలో జరిగిన ఇద్దరి హత్య కేసులో 13 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు రెబ్బెన పోలీసు అదికారులు తెలిపారు. ఇవ్వాల (బుధవారం) రెబ్బెన పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో నిందితుల అరెస్టు వివరాలను వివరించారు. మల్లేష్ (52) గణేష్ (32) వెంకటేష్ (19) భీమ్రావు (30) విరుగుల రాకేష్ (26) రంగ అక్క రంగక్క (42) గిరుగుల రజిత (29) రజిత (40) రుక్మ (24) రాటె భూమక్క (52) రాటే బుడయ్య (58) గిరుగుల దుర్గ (35) ఇరుగుల సౌమ్య (20) లను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు సీఐ తెలిపారు. నిందితుల వద్ద నుండి మూడు గుడ్డలు, రెండు కత్తులు, నాలుగు కర్రలు స్వాధీనం చేసుకొని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు వారు అధికారులు పేర్కొన్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే ఈనెల 26న సోమవారం మండలంలోని జక్కులపల్లి గ్రామ శివారులో వ్యవసాయ భూమిలో బక్కయ్య కుటుంబీకులకు, మండల మింగయ్య కుటుంబీకుల మద్య గొడవలు జరిగింది. ఈ గోడవలో ఇరువురి కుటుంబాలు కత్తులు, గొడ్డళ్లు ,రాళ్లతో, కారంపొడితో దాడి చేసుకోగా.. మండల నరసయ్య, గిరుగుల బక్కక్క మృతి చెందారు.. మరి కొంతమంది తీవ్ర గాయాలకు గురికావడంతో వారిని చూసి నిందితులు అక్కడి నుండి పరార్యారు. ఈ మేరకు మండల ఇందిర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని కేసును చేదించడంలో జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ఆదేశాల మేరకు రెబ్బెన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను పట్టుకొని అరెస్టు చేసి ఆసిఫాబాద్ కోర్ట్ కు హాజరు పరిచారు.