బెల్లంపల్లి : సింగరేణి కార్మిక సమస్యలపై కూడా దృష్టి సారించాలని వైస్ షర్మిలను సింగరేణి ఆపరేటర్స్ అండ్ కార్మిక సంఘం (ఎస్‌ఓకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు బెడ్డల విజయ్‌కుమార్ కోరారు. తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం రావాలన్న దృఢ సంకల్పంతో నూతన పార్టీ పెడుతున్న షర్మిలను ఎస్‌ఓకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బెడ్డల విజయ్‌కుమార్ మర్యాదపూర్వకంగా పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. సింగరేణి కార్మిక విభాగం వైపు కూడా దృష్టి సారించాలని షర్మిలను కోరినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా సింగరేణిలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను తన దృష్టికి తీసుకువెళ్లిన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు దుర్గం రాంచందర్, జాయింట్ సెక్రటరి గట్టు చిరంజీవి, ఎగ్జిక్యూటీవ్ మెంబర్లు కొలిపాక రణదీప్, వెంకటేష్ నాయకులు పుల్లూరి మహేష్, ప్రణయ్, కార్తిక్, దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement