బెల్లంపల్లి, : బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామపంచాయితీ పరిధిలోని బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా శివనామ స్మరణతో మారుమోగింది. శివరాత్రిని పురస్కరించుకొని మూడురోజుల పాటు జరిగే జాతరలో భాగంగా శివరాత్రి రోజున ఉదయం 4 గంటల నుండి రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించడం జరుగుతుంది. శివరాత్రి సందర్భంగా దేవాలయం అంతా భక్తులతో పోటెత్తింది. గత 400 సంవత్సరాల చరిత్ర కల్గి స్వయంభువుగా వెలిసి కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారమైన రాజరాజేశ్వర స్వామిని దర్శించుకునేందుకు బెల్లంపల్లి మండలం, భీమిని, నెన్నెల, కాసిపేట, భీమిని, కన్నెపల్లి, నెన్నెల, తాండూరు మండలాల నుండే కాకుండా మహారాష్ట్ర నుండి వేలాది మంది భక్తులు విచ్చేసి మొక్కులను చెల్లించుకున్నారు. జాతర ఏర్పాట్లను మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్ రెడ్డి పరిశీలించి అనంతరం పూజలను నిర్వహించారు. ఆలయంలో ఉదయం నుండి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గడ్డం కళ్యాణి-భీమాగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత-శ్రీధర్, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, మాజీ మంత్రి గడ్డం వినోద్, జెడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే అమరాజుల శ్రీదేవి, పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయంలో ఎలాంటి
ఇబ్బందులు కల్గకుండా ఏఓ వామన్‌రావు, ఆలయ కమిటీ చైర్మన్ మాసాడి శ్రీదేవి, గ్రామ సర్పంచ్ జిల్లపెల్లి స్వరూప-వెంకటస్వామిలు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. వచ్చిన భక్తులకు అభినవ స్వచ్చంధ సేవా సంస్థ, కన్నా యూత్ ఆధ్వర్యంలో వచ్చిన భక్తులకు సేవలు అందించారు. అదేవిధంగా మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో బాదం పాలు, పెర్క, మున్నూరుకాపు సంఘాల ఆధ్వర్యంలో మజ్జిగ, నీరు పంపిణీ చేయగా, సురేష్‌కుమార్ సార్డా ఆధ్వర్యంలో అన్నధానం చేయగా, యాదవ సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ, పలు సంఘాల ఆధ్వర్యంలో పలు సౌకర్యాలను కల్పించారు. ఈ జాతరలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు రూరల్ సీఐ జగదీష్, వన్‌టౌన్ సీఐ రాజు, తాండూరు సీఐ బాబురావులు పర్యవేక్షించారు. వారితో పాటు తాళ్ళగురిజాల ఎసై#్స సమ్మయ్య, టూటౌన్ ఎసై#్స భాస్కర్‌రావు, భీమిని ఎసై#్స కొమురయ్య, మాదారం ఎసై#్స మానస తదితరులు ఉన్నారు.
శివ నామ స్మరణతో మారుమోగిన బుగ్గ రాజరాజేశ్వర ఆలయం
Advertisement
తాజా వార్తలు
Advertisement