Saturday, November 23, 2024

లక్షకు పైగా భక్తులు..

బెల్లంపల్లి: బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామపంచాయితీలో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జరిగే బుగ్గ రాజరాజేశ్వర స్వామి జాతర 3వ రోజు కూడా అదే జోరుతో సాగింది. 3వ రోజు జాతరలో వేలాది మంది భక్తులు హాజరై రాజరాజేశ్వర స్వామి వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. మూడు గుట్టల వద్ద ఈ స్వయంభువు రాజరాజేశ్వర స్వామిని దర్శించుకునేందుకు బెల్లంపల్లి, భీమిని, తాండూరు, కాసిపేట, మందమర్రి, మంచిర్యాల నుండే కాకుండా ప్రక్క జిల్లా ఆసీఫాబాద్‌, ప్రక్క రాష్ట్రమైన మహారాష్ట్ర నుండి భక్తులు విచ్చేసి మొక్కులు చెల్లించుకున్నారు. చివరి రోజైన శుక్రవారం రోజున భోనాలు పోసి మొక్కులు చెల్లించుకొని సహపంక్తి భోజనాలు చేశారు. జాతరలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా తాళ్లగురిజాల ఎసై సమ్మయ్య ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్‌ మాసాడి శ్రీదేవి, కన్నాల సర్పంచ్‌ జిల్లపెల్లి స్వరూప-వెంకటేష్‌లు మాట్లాడుతూ 3 రోజుల పాటు జాతర దిగ్విజయంగా సాగిందని, జాతరకు లక్షకు పైగా భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకున్నారని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా దేవాదాయ శాఖ, దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లను చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement