Saturday, November 23, 2024

భూములపై వస్తున్న వార్తలు అవాస్తవం

బెల్లంపల్లి : నెన్నెల మండలంలో అసైన్‌మెంట్‌ రివ్యూ కమిటీ అనుమతులు లేకుండా ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేయించి పట్టా పాస్‌ పుస్తకాలు ఇచ్చిన వ్యక్తిని అరెస్ట్‌ చేసినట్లు రామగుండం సీపీ వి.సత్యనారాయణ తెలిపారు. బెల్లంపల్లి రూరల్‌ సర్కిల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పూదరి నరేష్‌ గౌడ్‌ మీడియా ముందు హాజరు పరిచి వివరాలు వెల్లడించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ నెన్నెల తహశిల్దార్‌ జాడి రాజలింగు ఇచ్చిన ధరఖాస్తుపై నెన్నెల మండలంలోని వివిధ లావని పట్టా, ఇతర ప్రభుత్వ భూములకు సంబంధించి తహశిల్దార్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న పూదరి నరేష్‌ అనే వ్యక్తి నెన్నెల తహశిల్దార్‌ కార్యాలయంలో డోంగల్‌ను దుర్వినియోగం చేసి పట్టా చేశాడని ఫిర్యాదు చేయగా నెన్నెల పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేయడం జరిగిందని, ఈ కేసులో పెద్దమొత్తంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైనందున బెల్లంపల్లి రూరల్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ జగదీష్‌ విచారణ అధికారిగా నియమించి విచారణలో రెవెన్యూ అధికారులు ఇచ్చిన విచారణ నివేధికను పరిశీలించగా 178 మంది పాస్‌బుక్‌ల నుండి 90 మంది రైతులు అర్హులుగా, 88 మంది అనర్హులుగానూ తేల్చడమైందని, నెన్నెల మండలంలోని ఖమ్మంపల్లిలో రెండు పాస్‌ బుక్‌లు 6 ఎకరాలు, జోగాపూర్‌లో 23 పాస్‌బుక్‌లు 57.14 ఎకరాలు, పాపులవాణిపేటలో 3 పాస్‌ పుస్తకాలు 7.20 ఎకరాలు, మన్నెగూడెంలో 6 పాస్‌ పుస్తకాలు 20.29 ఎకరాలు, గొల్లపల్లిలో 24 పాస్‌ పుస్తకాలు 45.6 ఎకరాలు, నెన్నెల గ్రామంలో 15 పాస్‌ పుస్తకాలు 45.14 ఎకరాలు, గన్‌పూర్‌లో 7 పాస్‌ పుస్తకాలు 10.33 ఎకరాలు, మైలారంలో 8 పాస్‌ పుస్తకాలు 16.3 ఎకరాలు, మొత్తం నెన్నెల మండలంలోని 8 గ్రామాల్లో 88 పాస్‌ పుస్తకాలు 207.19 ఎకరాలకు ఇవ్వడం జరిగిందని అన్నారు. తహశిల్దార్‌ కార్యాలయంలో 2010 నుండి 2018 మార్చి వరకు పనిచేసిన పూదరి నరేష్‌ గౌడ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా పూదరి నరేష్‌ గౌడ్‌ 2010 జూన్‌ 5వ తేదిన నెన్నెల తహశిల్దార్‌ కార్యాలయంలో అప్పటి తహశిల్దార్‌ హరికృష్ణ పనిచేస్తున్నప్పుడు ల్యాండ్‌ రికార్డ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ద్వారా రైతులకు పహానీలు ఇవ్వడానికి నెలకు రూ.1500 చొప్పున జీతంలో చేరి 2012 సంవత్సరం వరకు భూములకు సంబంధించిన పహానీలు, ఎల్‌ఆర్‌ఎంఎస్‌ ద్వారా ఇచ్చారని, 2012 మార్చి నెల నుండి మీసేవలు మొదలు కావడంతో వెబ్‌లైన్‌ అనే కొత్త వెబ్‌సైట్‌లో డోంగల్‌ను ఉపయోగించి డిజిటల్‌ సైన్‌ ద్వారా పాస్‌ పుస్తకాన్ని ఇచ్చేవారని, ప్రభుత్వ భూములకు సంబంధించిన పహానీ నమోదు చేయాలంటే ఏఆర్‌సీ అప్రూవల్‌ చేసిన సర్వే నెంబర్లను మాత్రమే నమోదు
చేయాలని, ల్యాండ్‌ రికార్డులను ఎవరు పట్టించుకోనందున, నరేష్‌ పని చేసిన కాలంలో నెన్నెల మండల తహశిల్దార్‌గా పనిచేస్తున్న హరికృష్ణ, వీరన్న, రాజేశ్వర్‌లు, వీఆర్‌ఓలు తిరుపతి, మల్లేష్‌, వెంకటస్వామి, రాజన్న, ఇక్భాల్‌, మెహబూబ్‌, కరుణాకర్‌లు పైన తెలిపిన 8 గ్రామాల్లోని రైతుల వద్ద అక్రమంగా డబ్బులను తీసుకొని ప్రభుత్వ, లావని పట్టాలకు చెందిన భూములకు ప్రోసీజర్‌పై కాకుండా అసైన్‌మెంట్‌ రివ్యూ కమిటీ అనుమతులు లేకుండా ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేయించి వారికి పాస్‌ పుస్తకాలు ఇస్తూ తనకు కూడా ప్రతీ పాస్‌ పుస్తకంపై రూ.1000 నుంచి రూ.2000 వరకు ఇచ్చి అనర్హులైన వారి భూములను ఆన్‌లైన్‌ చేయించారని, తనకు ఇచ్చిన డబ్బులను తాను వాడుకున్నానని నరేష్‌ పేర్కొన్నాడని చెప్పారు. ఈ కేసులో నిందితులు పూదరి నరేష్‌ గౌడ్‌, పై#్రవేటు కంప్యూటర్‌ ఆపరేటర్‌ పి.హరికృష్ణ, జి.వీరన్న, డి.రాజేశ్వర్‌లు గతంలో తహశిల్దార్‌గా పనిచేసిన వారు తిరుపతి, రత్నం వెంకటస్వామి, కొండగొర్ల రాజన్న, షిండె కరుణాకర్‌, షేక్‌ మెహబూబ్‌, వేముర్ల మల్లేష్‌, ఎం.డి.ఇగ్బాల్‌, గతంలో వీఆర్‌ఓలుగా పనిచేసిన వారు నిందితులుగా తెలిపారు. ఈ కేసు విచారణలో భాగంగా కలెక్టర్‌ కార్యాలయంలో ఇట్టి భూ వివాదంలో చేపట్టిన విచారణ పత్రాలను నెన్నెల తహశిల్దార్‌ కార్యాలయం నుండి భూముల వివరాలను సేకరించి పైన పేర్కొన్న 88 మంది అనర్హులైన రైతులను విచారించి వారి బయాన రాసుకొని రెవెన్యూ వివరాలనూ, అధికారుల యొక్క పాత్రపై కేసు దర్యాప్తు సాగుతుందని పేర్కొన్నారు.

భూములపై సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం
—రామగుండం సీపీ వి.సత్యనారాయణ : గత కొన్ని రోజులుగా వందలాది ఎకరాల భూములకు సంబంధించి వందల కోట్లు చేతులు మారుతున్నాయని సోషల్‌ మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవమని, అలాంటి అవాస్తవ వార్తలు సోషల్‌ మీడియా ప్రచారం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఇలాంటి వార్తలను ప్రజలు నమ్మవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్‌ రెడ్డి, బెల్లంపల్లి ఏసీపీ రహెమాన్‌, బెల్లంపల్లి రూరల్‌ సీఐ జగదీష్‌, వన్‌టౌన్‌ సీఐ రాజు, ఎసై#్సలు భాస్కర్‌రావు, సమ్మయ్య, రవికాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement