పెద్దపల్లిరూరల్: దేశీయ బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు వ్యతిరేకంగా పెద్దపల్లి ఎల్‌ఐసీ కార్యాలయం ఎదుట ఉద్యోగులు ఒకరోజు ఆందోళన దీక్ష కొనసాగించారు. కార్యాలయం ముందు బైఠాయించి కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లాభాల బాటలో ఉన్న బీమా సంస్థల్లో విదేశీ ప్ర త్యక్ష పెట్టుబడులను 70శాతానికి పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. బీమా కంపెనీలను ప్రైవేటుపరం చేసే విధంగా కేంద్ర ప్ర భుత్వం వ్యవహరిస్తుందని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో ఐసీఈయూ నాయకులు పి. సత్యనారాయణ, విద్యాసాగర్, ఎన్‌ఎఫ్‌ఐ ఎఫ్‌డబ్ల్యుఐ నాయకులు రాంప్రతాప్, జీటీసిరెడ్డి, క్లాస్-1 అధికారుల సంఘం నాయకులు రాధిక, రాణి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement