మంచిర్యాల : మంచిర్యాల జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. పాఠశాలలు, కళాశాలల్లో పదుల సంఖ్యలో పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించగా 16 మందికి పాజిటీవ్ వచ్చింది. అదేవిధంగా ఈ నెల 14వ తేదిన ఎస్సీ బాలుర వసతి గృహంలో 50 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా 6 గురికి పాజిటీవ్ రావడంతో వారిని వెంటనే రామక్రిష్ణాపూర్ ఐసోలేషన్ కేంద్రానికి తరలించగా మిగతా వారిని వారి వారి స్వగృహాలకు పంపించి హాస్టల్‌ను తాత్కాళికంగా మూసేశారు. పాజిటీవ్ వచ్చిన వారిలో డిగ్రీ విద్యార్థులు కూడా ఉండటంతో డిగ్రీ కళాశాలలో 76 మందికి పరీక్షలు నిర్వహించగా 16 మందికి పాజిటీవ్ వచ్చినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. పాజిటీవ్ వచ్చిన వారిలో ఎస్టీ బాలికల వసతి గృహం విద్యార్థులు కూడా ఉండటంతో బాలికల వసతి గృహం విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పాజిటీవ్ కేసులు పెరుగుతున్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు జిల్లా విద్యాదికారి వెంకటేశ్వర్లు మూడు రోజులు సెలవులను ప్రకటించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement