Tuesday, November 26, 2024

ఘనంగా కాగజ్ నగర్ కళాశాల స్వర్ణోత్సవం.

కాగజ్ నగర్ కోమురంబీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల స్వర్ణోత్సవం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీధర్ సుమన్ అధ్యక్షతన, అడిషనల్ కలెక్టర్ రాంబాబు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన తో కార్యక్రమం ప్రారంభం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ స్వర్ణోత్సవం వేడుకల నివెధికలతో గత యాభై సంవత్సరాలలో కళాశాల ప్రగతి, పూర్వ ప్రిన్సిపాళ్ళు, అధ్యాపకుల కృషిని వివరించారు. స్వర్ణ ప్రస్థానం పేరుతో రూపొందించిన సావనీర్ ను ముఖ్య అతిధి ఆర్జేడి జయప్రద బాయి చేతుల మీదుగా అవిష్కరించారు. కళాశాలలో పనిచేసే రైటర్ అయిన, ఇతర ప్రాంతాల్లో పనిచేస్తూన్న వారిని కూడా పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానం చేశారు. ఎమ్మెల్యే తరపున హాజరైన పూర్ణచందర్ మాట్లాడుతూ సిర్పూరు శాసనసభ్యులు కోనేరు కోనప్ఫ చదివిన కళాశాల యాభై సంవత్సరాలలో పలు విజయాలు సాధించిందని,మధ్యాహ్నం భోజనం,మామిడి తోటల పెంపకం వంటి కార్యక్రమాలలో విద్యార్థులు పాల్గొనడం ప్రసంసనియమన్నారు. జె సి. రాంబాబు మాట్లాడుతూ స్వర్ణ ప్రస్థానం పేరుతో రూపొందించిన సావనీర్ కళాశాల చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలి పోతుందన్నారు. కొత్త కోర్సులు ప్రారంభించడం ద్వారా వందలాది మంది విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయన్నారు. తమకు చదువు చెప్పిన గురువులను కలుసు కోవడం, సన్మానించుకోవడం ఒక మరుపు రాని అపురూపమైన ఘట్టమని, మంచి గురువులను ఎవ్వరూ మరిచిపోలేరన్నారు. ఇంటర్మీడియట్ విద్య ఆర్జేడి జయప్రద బాయి మాట్లాడుతూ స్వర్ణోత్సవం వేడుకల్లో భాగంగా ఆడిటోరియం నిర్మాణం, సావనీర్ రూపొందించడం ఒక గోప్ప ప్రయత్నం అని ప్రిన్సిపాల్ ఆలోచనల్ని అమలు నడుస్తున్న అధ్యాపకుల కృషిని కోనియాడారు. ఇంటర్ విద్యా ఐకాస్ చైర్మన్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఇంటర్ విద్యకు ఆద్యుడు పీ వి నర్సింహారావు చేసిన సేవలను మర్చిపోలేమన్నారు. స్వర్ణోత్సవం సందర్భంగా గురువుల ద్వారా పొందిన జ్ఞానాన్ని శిష్యులు శాశ్వతంగా గుర్తుంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ ప్రిన్సిపాళ్ళు భాస్కర్, అబ్దుల్లా, రవీందర్, అధ్యాపకులు కిషోర్ తదితరులను సన్మానించారు. ఇంటర్ కళాశాలల ప్రిన్సిపాళ్ళ సంఘం ప్రధాన కార్యదర్శి కళింగ కృష్ణా కుమార్, లక్ష్మణరావు, అధ్యాపకులు జూపిషా సూల్తానా, అమీర్ ఉన్నీసా, రవి, ఆనంద్, మునువర్ హుస్సేన్, బావాజీ పాల్గొన్నారు. విద్యార్థుల డ్యాన్స్ లు పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement