కాసిపేట : కాసిపేట మండలం ముత్యంపల్లి క్రీడా మైధానంలో కొక్కిరాల రఘుపతిరావు స్మారక క్రికెట్ క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, సింగిల్‌విండో చైర్మన్‌గా ఎంపీపీగా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించిన మంచి నాయకుడు అని కొనియాడారు. తన ఎంపీపీ కాలంలో మండలానికి అనేక చిన్న తరహా సాగునీటి ప్రాజెక్ట్‌లను తీసుకువచ్చి వ్యవసాయ అభివృద్ధికి కృషి చేశారని పేర్కొన్నారు. అతని సేవలు మండలంలో చిరస్థాయిగా ఉంటాయని అన్నారు. అతని కుమారుడు ప్రేంసాగర్‌రావు సహాయ సహకారాలతో క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు, గెలుపొందిన విజేతలకు పీఎస్‌ఆర్ ట్రోఫీతో పాటు నగదు బహుమతిని అందజేయనున్నట్లు నాయకులు పేర్కొన్నారు. అంతకముందు రఘుపతి రావు చిత్రపటానికి పూలమాలలు వేసిన నాయకులు, కార్యకర్తలు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సిద్ధం తిరుపతి, పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ, స్థానిక సర్పంచ్ ఆడె బాదు, ఉప సర్పంచులు బోయిని తిరుపతి, రమేష్, నాయకులు నస్పూరి నర్సింగం, చిన్నభీమయ్య, నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement