గణపురం:చెలుమల్ల వినయ్ 5వ వర్ధంతి సందర్భంగా శనివారం మండల కేంద్రంలోని వినయ్ హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి అపూర్వ స్పందన లభించిందని వినయ్ హాస్పిటల్స్ చైర్మన్ చెలుమల్ల సంపత్ తెలిపారు.డాక్టర్ వినోద్ కుమార్ ,డాక్టర్ రాఘవ, డాక్టర్ అమిత అలుగోజు,డాక్టర్ సారంగపాణి,డాక్టర్ సంతోష్ ల ఆధ్వర్యంలో షుగర్,బిపి పేషేంట్లు 1000మందికి పైగా ఉచితంగా పరీక్షలు నిర్వహించి, సుమారు లక్ష రూపాయల విలువ గల మందులు అందజేసినట్లు సంపత్ వివరించారు.ఈ కార్యక్రమంలో రెండవ ఎస్ఐ కాసిబోయిన సత్యనారాయణ రాజు,ఉప సర్పంచ్ పోతర్ల అశోక యాదవ్,జిల్లా ఆర్ఎంపిల సంఘం అధ్యక్షుడు చాగర్తి లక్ష్మీనారాయణ,స్వామి,ఆసుపత్రి సిబ్బంది,చిలుమోజు భాస్కర్,వీరమల్ల మంజుశ్రీ,ముల్కనూరి శైలజ, సంధ్య, సరిత, భద్రమ్మ,ల్యాబ్ టెక్నిషీయన్ లు,ఏఎన్ఎమ్ లు, నాయకులు రేపాక రాజేందర్, దూడపాక దుర్గయ్య,తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement