కాసిపేట : మండలంలోని కాసిపేట గ్రామపంచాయితీలో పలు అభివృద్ధి పనులను సర్పంచ్ దరావత్ దేవి ప్రారంభించారు. గ్రామంలోని 6వ వార్డులో రూ.1లక్షతో సీసీ రోడ్డు పనులను, రూ.3లక్షలతో సీసీ డ్రైనేజీ భూమిపూజ పనులను ప్రారంభించారు. పంచాయితీకి మంజూరైన నిధులతో పంచాయితీలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల్లో భాగంగా నూతనంగా అభివృద్ధి పనులను చేపట్టినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అక్కెపల్లి లక్ష్మి, ఉప సర్పంచ్ పిట్టల సుమన్, వార్డు సభ్యులు అగ్గి వెంకటేశ్వర్లు, రేణుక, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement