Thursday, October 24, 2024

Adilabad – రైతుల కోసం జైలుకైనా వెళ్తాం – ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోం: కెటిఆర్

ఖానాపూర్‌లో రెండు వేల ఇండ్లు కూల్చేందుకు వెళ్లారు
కాంగ్రెస్ నేత‌ల‌ను ఉరికించి కొట్టే రోజులు వ‌స్తున్నాయి
పోలీసులైనా, అధికారులైనా ఎక్స్‌ట్రాలు చేయొద్దు
ఆదిలాబాద్ రైతు ధ‌ర్నాలో మండిప‌డ్డ‌ కేటీఆర్

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్, ఆదిలాబాద్ :
రాష్ట్ర ప్ర‌జ‌లు, రైతుల సంక్షేమం కోసం జైలుకు పోవ‌డానికి కూడా రెడీగా ఉన్నాన‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని రామ్‌లీలా మైదానంలో ఏర్పాటు చేసిన రైతుల‌ ధ‌ర్నాలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌ను ఉరికించి కొట్టే రోజులు ద‌గ్గర ప‌డ్డాయ‌ని అన్నారు. అన్ని ప‌నులు అస్త‌వ్య‌స్తంగా ఉన్నాయ‌ని, మేడ్చ‌ల్ వ‌ద్ద‌నే 45 నిమిషాలు స‌మ‌యం ప‌ట్టింద‌న్నారు.

- Advertisement -

డిచ్‌ప‌ల్లిలో రోడ్డెక్కిన మ‌హిళ‌లు
డిచ్‌ప‌ల్లి వ‌ద్ద కొంద‌రు మ‌హిళ‌లు రోడ్డుకు అడ్డంగా కూర్చుని ధ‌ర్నా చేస్తున్నార‌ని, ఏం క‌ష్ట‌మొచ్చింది అని దిగి అడిగాన‌ని కేటీఆర్ చెప్పారు. వాళ్లు పోలీసోళ్ల కుటుంబ స‌భ్యుల‌ని, వ‌న్ పోలీసింగ్ కావాల‌ని డిచ్‌ప‌ల్లి బెటాలియ‌న్ వ‌ద్ద‌ ధ‌ర్నా చేస్తున్నార‌ని తెలిపారు. అఖ‌రికి కాంగ్రెస్ పాల‌న‌లో పోలీసోళ్ల కుటుంబ స‌భ్యులు కూడా ధ‌ర్నాలు చేసే ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు. .

చీటింగ్ కేసు పెడితే ఏ ఒక్క కాంగ్రెస్ నాయ‌కుడు కూడా మిగల‌డు

అస‌లు చీటింగ్ కేసులు ఎవ‌రి మీద పెట్టాల‌ని కేటీఆర్ ప్ర‌శ్నించారు. తులం బంగారం ఇస్తామ‌ని చెప్పి మోసం చేసిన వారి మీద కేసులు పెట్టాల‌న్నారు. రైతుబంధు ఎగ్గొట్టి, రుణ‌మాఫీ చేయ‌నందుకు రైతులు కేసులు పెట్టాల‌ని సూచించారు. 2 ల‌క్ష‌ల ఉద్యోగాల‌ని చెప్పి.. ఇప్ప‌టి వ‌ర‌కు ఉద్యోగ నోటిఫికేష‌న్లు ఇవ్వ‌నందుకు యువ‌త కేసులు పెట్టాల‌ని, ఇలా అన్ని వ‌ర్గాలు పోలీసు స్టేష‌న్ల ముందు లైన్లు క‌ట్టి చీటింగ్ కేసు పెడితే ఏ ఒక్క కాంగ్రెస్ నాయ‌కుడు కూడా మిగల‌డు అని కేటీఆర్ తెలిపారు.

పోలీసులైనా, అధికారులైనా ఎక్స్‌ట్రాలు చేస్తే..

అధికారం ఎవ‌రికీ శాశ్వ‌తం కాద‌ని, ఇలాంటి కిరాత‌క ప‌నులు బీఆర్ఎస్ పాల‌న‌లో చేయ‌లేద‌ని, మంత్రినో, కంత్రినో ఫోన్ చేస్తే ఆగం కాకండి.. న్యాయం, ధ‌ర్మం ప్ర‌కారం న‌డుచుకోండి అని పోలీసుల‌కు కేటీఆర్ సూచించారు. పోలీసులైనా, అధికారులైనా ఎక్స్‌ట్రాలు చేస్తే పేర్లు రాసిపెట్టి మిత్తితో స‌హా ఇస్తామ‌న్నారు.

రైతుల మీద కేసులు పేడితే ఊరుకోం..

ఆదిలాబాద్‌లో ఖానాపూర్ చెరువు వ‌ద్ద 2 వేల‌ ఇండ్లు కూల‌గొట్టేందుకు అధికారులు వెళ్లార‌ని, కాంగ్రెస్ ప్ర‌భుత్వంలోనే ఆ ఇండ్ల‌కు ప‌ర్మిష‌న్లు, ప‌ట్టాలు ఇచ్చార‌ని కేటీఆర్ అన్నారు. ఇల్లు కూల‌గొడితే ఎవ‌డ‌న్న ఊకుంటాడా..? రైతుల మీద కేసులు పెడుతాం అంటే ఊరుకునేందుకు సిద్ధంగా లేమ‌ని కేటీఆర్ తేల్చిచెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement