Monday, November 11, 2024

Adilabad – గోవులను తరలిస్తే చర్యలు తప్పవు – జిల్లా ఎస్పీ గౌస్ అలం

ఆంధ్రప్రభ బ్యూరో, ఆదిలాబాద్ :పశువుల అక్రమ రవాణా నిరోధానికి తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో అంతర్ రాష్ట్ర చెక్పోస్టులు ఏర్పాటు చేసి 20 రోజులు నిఘా పెట్టినట్టు అదిలాబాద్ ఎస్పీ గౌస్ అలం తెలిపారు. ఆదివారం పోలీస్ అధికారులతో బక్రీద్ పండగ పురస్కరించుకొని శాంతి భద్రతలపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లోఆరు అంతర్ రాష్ట్ర, ఆరు అంతర్ జిల్లా చెక్పోస్టులను ఏర్పాటుచేసి ముమ్మర తనిఖీలు చేపట్టాలని సూచించారు.

బక్రీద్ పండుగను జిల్లా ప్రజలు మత సామరస్యాన్ని కాపాడుతూ ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు రేపటి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గత 20 రోజులుగా ఆరు అంతర్రాష్ట్ర, ఆరు అంతర జిల్లా చెక్పోస్టులను ఏర్పాటు చేసి ప్రతి చెక్ పోస్ట్ నందు 5 గురు సిబ్బందిని ఏర్పాటుచేసినట్టు తెలిపారు.24 గంటలు వాహనాల తనిఖీలు చేపట్టి ఆవుల అక్రమ రవాణా జరగకుండా విధులను నిర్వర్తిస్తున్నట్లు తెలియజేశారు.

ఆదిలాబాద్, ఇచ్చోడ, ఉట్నూర్ మూడు ప్రధాన పట్టణాల్లో ఆకస్మిక తనిఖీలను నిర్వర్తిస్తూ అక్రమ రవాణా కు అడ్డుకట్ట వేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్టు తెలియజేశారు.

- Advertisement -

బక్రీద్ పండుగ సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలో, జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తుల ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలు సామాజిక మాధ్యమాలలో వచ్చే వదంతులను నమ్మకూడదని తెలియజేశారు, ఎటువంటి సమాచారం అందజేయాలన్న డైల్ – 100 లేదా సంబంధిత పోలీస్ స్టేషన్లకు సంప్రదించాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి సురేందర్రావు, డిఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్ జీవన్ రెడ్డి, సిహెచ్ నాగేందర్, సిఐలు ఎస్సైలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement