Tuesday, November 26, 2024

మంచు కురిసే వేళలో.. కాశ్మీర్‌ని త‌ల‌పిస్తున్న ఆదిలాబాద్‌..

ప్రకృతి అందాలకు నిలయమైన ఆదిలాబాద్‌లో ఇప్పుడు మంచు విప‌రీతంగా కురుస్తోంది. ప‌చ్చ‌ని అడ‌వులు, గుట్ట‌లు, చెట్లు, జ‌ల‌పాతాలు.. కిల‌కిలారావాల‌తో అంద‌మైన ఆదిలాబాద్ ద‌ట్ట‌మైన మంచుతో కాశ్మీర్‌ను త‌ల‌పిస్తోంది. తెల్లవారుజామున కురుస్తున్న పొగమంచు చూపరులకు కనువిందు చేస్తున్నది. ఆదిలాబాద్‌ పట్టణాన్ని ఈ ఉదయం (బుధవారం) పొగమంచు కమ్మేసింది.

ఉదయం 7 గంటలు దాటినప్పట్టికీ మంచు తెర‌లు వీడ‌లేదు. జిల్లావ్యాప్తంగా ఈ ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అయితే మంచు విపరీతంగా కురుస్తుండటంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పొగ మంచుతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. అడుగు దూరంలోని మనిషి కూడా కనిపించని రీతిలో మంచు కమ్ముకున్నది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement