Sunday, November 3, 2024

Adilabad – కాంగ్రెస్ కు క‌ర్రు కాల్చి వాత పెట్టాల్సిందే – కెటిఆర్

హామీలు నెర‌వేర్చ‌ని రేవంత్ ను ఓడించాల్సిందే
రుణ‌మాఫీపై కొత్త రాగం అందుకున్న సిఎం
ఇంత‌కీ రేవంత్ ఏ పార్టీలో ఉన్నారు.
కాంగ్రెస్ కు ఓటేస్తే వేళ్లేది బిజెపికే
ఈసారి బిజెపి గెలిస్తే రిజ‌ర్వేష‌న్ లు గోవిందా
అదిలాబాద్ బిఆర్ఎస్ మీటింగ్ లో కెటిఆర్

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో (ప్రభ న్యూస్) – అరచేతిలో వైకుంఠం చూపించి, 100 రోజుల్లో గ్యారంటీ లు అమలు అని కాంగ్రెస్ పార్టీ గద్దె ఎక్కింద‌ని ఆరోపించారు బిఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్. అధికారంలోకి వ‌చ్చిన రేవంత్ ఏం చేశారో ఆలోచించాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరారు.. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, డిసెంబర్ 9న రుణ మాఫీ చేస్తామ‌న్నార‌ని, కానీ ప్రమాణ స్వీకారం మాత్రం రెండు రోజుల ముందు చేసి రూ. 2 లక్షల రుణ మాఫీ గాలికి వదిలేశారని ధ్వ‌జ‌మెత్తారు. ఇప్పుడు తాజాగా ఆగస్టు 15న రైతుల రుణ మాఫీ అంటూ సిఎం డైలాగ్ లు చెప్పుతున్నారని దెప్పిపొడిచారు..

క‌ర్రు కాల్చి వాత పెట్టాల్సిందే …

- Advertisement -

కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెడితే నే అన్ని నెరవేరుతాయన్నారు కెటిఆర్. ఫ్రీ బస్సు మాయం కావడం ఖాయమని కీలక వ్యాఖ్యలు చేశారు. లంకె బిందెలు అంటున్నార‌ని, . లంకె బిందెల కోసం అది పచ్చి దొంగలు తిరుగుతారని అన్నారు. రైతు బంధు అడిగితే కోమటి రెడ్డి చెప్పు తో కొడతా అంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చింది.. తాగు నీళ్ళు లేవని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి మోస పోవాలని కోరుకుంటారు అని చెప్పి మరీ మోసం చేసారన్నారు. మనం ఎం చేశామో చెప్పుకో లేక పోవడం మన తప్పని తెలిపారు. మొన్న కాంగ్రెస్ ఇచ్చిన 32 వేల ఉద్యోగాల కాగితాలు మనం ఇచ్చిన వే అన్నారు. పిల్లలు పుట్టాలి అంటే లగ్గం కావాల‌ని, .. నోటిఫికేషన్ ఇవ్వక ముందే కాంగ్రెస్ ఎలా ఉద్యోగాలు ఇచ్చారు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వాళ్ళు మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలే అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంత‌కీ రేవంత్ ఏ పార్టీలో ఉన్నారు…

పేగులు మెడలు వేసుకుంటా అంటున్నార‌ని. ఆయన సీఎం నా బోటి కొట్టే వ్యక్తా? అని ప్రశ్నించారు. మీ ప్రభుత్వాన్ని కొల్లగొట్టే ఖర్మ త‌మాకు పట్టలేదన్నారు కెటిఆర్ . ఐదేళ్లు మీ ప్రభుత్వం ఉండాల‌ని, 5 ఏళ్లు నడుపు 420 హామీలు నెరవేర్చు అన్నారు. రాహుల్ గాందీ మోడీని చోర్ అంటే రేవంత్ రెడ్డి మాత్రం బడే బాయ్ అంటున్నారని గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత తెలంగాణ లో మార్పులు వస్తాయి. నంబర్ వన్ జంప్ అయ్యే వ్యక్తే రేవంత్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి రాహూల్ గాంధీ మనిషా , మోడీ మనిషా ఆలోచించాలని అన్నారు. దమ్ముంటే మీ కాంగ్రెస్ నేతలు చెప్పాలి రేవంత్ ఏ పార్టీ నేత నో చెప్పండి అన్నారు.

బిజెపి మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తే…

కాంగ్రెస్ పార్టీ ఒక్క ఓటు కాంగ్రెస్ కు వేసిన అది బీజేపీకి పోతుందన్నారు. బీజేపి మరో సారి అధికారం లోకి వస్తే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ లు పోతాయని పేర్కొన్నారు కెటిఆర్ . ప్రభుత్వ రంగ సంస్థల ను అమ్ముతున్నందుకు మోడీ దేవుడా? అని ప్రశ్నించారు. బయ్యారం ఉక్కు కర్మాగారం ఏది? ఆదిలాబాద్ లో సిసి ఐ రీ ఓపెన్ ఎక్కడ? అని ప్రశ్నించారు. రాముడి ని మొక్కు దామ‌ని అదే స‌మ‌యంలో తెలంగాణ కు పైసా పని చేయని బిజేపి ని తొక్కుదామని పిలుపు ఇచ్చారు..

అన్ని చేసినా మ‌న‌సు గెలువ‌లేక‌పోయాం
టెట్ కోసం 2 వేల ఫీజు పెట్టారన్నారు. కాంగ్రెస్ మాటలు ఆకాశంలో చేతలు పాతాళం లోనే అన్నారు కెటిఆర్ . ఉద్యోగాలకు అత్యధికంగా ఇచ్చినా వాళ్ళ మనస్సును సైతం గెలుచు కో లేక పోయామన్నారు. కొమురం భీం ఆశయాలను నెరవేర్చింది బీఆర్ఎస్ అన్నారు. ఇంద్రవెల్లి లో ఆదివాసి లను కాల్చి చంపింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. అమర వీరులకు కనీసం క్షమాపణ చెప్పలేదని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజల భ్రమలు తొలగి పోతాయన్నారు. పెద్ద పెద్ద పదవులు అనుభవించిన వాళ్లే జబ్బలు జారేస్తున్నారని కెటిఆర్ మండిప‌డ్డారు. నాయకులు పదవులు , పైరవీల కోసం పార్టీలు మారుతున్నారని తెలిపారు. ఏ ఎన్నిక జరిగినా ఎగిరేది గులాబీ జెండా నే అన్నారు. ఉద్యమ సమయంలో ఎవ్వరు ఉన్నారో వాళ్ళే ఇప్పుడు పార్టీలో ఉన్నారని తెలిపారు. అదిలాబాద్ అభ్య‌ర్ధిని నాలుగు నెల‌ల క్రిత‌మే ప్ర‌క‌టించామ‌ని, ఈ ఎన్నిక‌ల‌లో ఆత్రం సక్కు ను భారీ మెజార్టీతో గెలిపించాల‌ని కెటిఆర్ పిలుపు ఇచ్చారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement