నేరడిగొండ ప్రభ న్యూస్ : హలో నీకు ఇన్కమ్, క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలా అయితే నాతో మాట్లాడు..లేదా నీ దరఖాస్తులను రిజెక్ట్ చేసేస్తా..నేను..తహశీల్దార్ కార్యాలయ సిబ్బందిని మాట్లాడుతున్న రిప్లై ఇవ్వవా.. అంటూ తహశీల్దార్ కార్యాలయంలో కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్న మహిళను తాసిల్దార్ కార్యాలయ అటెండర్ రాత్రి సమయంలో ఫోన్ లో అసభ్యకర వాట్సాప్ లో మెసేజ్ లు , వాయిస్ రికార్డులు చేస్తూ వేధించడంతో ఆ మహిళ కుటుంబీకులు అటెండర్ ను దేహశుద్ధి చేసిన సంఘటన మండలకేంద్రంలో చోటు చేసుకుంది ..
మండల కేంద్రానికి చెందిన ఓ వివాహిత ఆదాయ కుల ధ్రువీకరణ పత్రాల కోసం తహసిల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంది. అదే కార్యాలయంలో అటెండర్ దరఖాస్తు ఫారంలో ఉన్న మహిళ ఫోన్ నెంబర్ ను తీసుకొని రాత్రి సమయంలో మహిళకు కాల్ చేసి తహసిల్దార్ కార్యాలయానికి చెందిన అధికారిని అంటూ అటెండర్ అశోక్ మాట్లాడం మొదలు పెట్టాడు..అటెండర్ ఆ సదరు మహిళను ఫోన్లో అసభ్యకర మెసేజ్లు పంపుతూ వేదించాడు.. నీకు సర్టిఫికెట్స్ కావాలి అంటే నాతో మాట్లాడు లేదా నీ సర్టిఫికెట్స్,రేషన్ కార్డ్ మొత్తం రిజెక్ట్ చేసేస్తా అది నా చేతిలోని పని అంటూ మహిళను బెదిరించాడు.. ఆ మహిళ అసభ్యకర మెసేజ్లు కాల్ రికార్డు చేసుకుని గురువారం మహిళా కుటుంబీకులు తహశీల్దార్ కార్యాలయానికి చేరుకొని జూనియర్ అసిస్టెంట్ రవిని నిలదీశారు.. అతను అవి తాను మాట్లాడినవి మాటలు కావని చెప్పాడు.. అది అటెండర్ అశోక్ చేసిందని తెలుసుకున్న మహిళ కుటుంబీకులు వడూర్ గ్రామానికి వెళ్లి ఆటోలో అశోక్ ను ఎక్కించుకుని తహశీల్దార్ కార్యాలయానికి తీసుకొచ్చి చెప్పులతో దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.