Wednesday, January 29, 2025

Adilabad | చెప్పులు ధరించి ఊరికి వస్తే జరిమానా!

ఆంధ్రప్రభ, బ్యూరో ఉమ్మడి ఆదిలాబాద్ : పుష్యమాసంలో ఆదివాసి గిరిజనులు పాటించే ఆచార వ్యవహారాలు చెప్పడానికి, వినడానికి విడ్డూరంగానే అనిపించవచ్చు. కానీ అనాదిగా ఆదివాసీలు పాటించే నియమాలు కొత్త వారికి వింతగానే కనిపిస్తాయి. పవిత్ర పుష్య మాసంలో పండుగలు, దీక్షలు, జాతర ఉత్సవాల్లో పాదరక్షలు లేకుండానే ప్రతిరోజు మైళ్ల దూరం కాలినడకన నడవడం పరిపాటే. ఆదివాసి గిరిజనులు కేస్లాపూర్ నాగోబా జాతర ఉత్సవాల సందర్భంగా పలు ఆంక్షలు నిబంధనలతో తీర్మానాలు చేసి అందరికీ హుకుం విధించారు. ఈ నెలలో అతి పవిత్రంగా భావించే ఆరాధ్య దైవం జంగు భాయి జాతర సందర్భంగా వేలాదిమంది గిరిజనులు కుటుంబ సమేతంగా పాదరక్షలు లేకుండానే దీక్షలు చేపట్టి నియమనిష్టలు పాటిస్తున్నారు.

- Advertisement -

తుమ్మగూడలో పాదరక్షలకు చెక్ పోస్ట్.. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ నాగోబా జాతర సందర్భంగా తమ ఊరికి వచ్చే ఎవరైనా సరే పాదరక్షలు లేకుండా రావాలని సమీప తుమ్మగూడ గ్రామస్తులు ఆంక్షలు విధించారు. అంతేకాదు పాదరక్షలు ధరించి ఊరికి వస్తే రూ. 5వేలు జరిమాన చెల్లించాల్సి ఉంటుందని ఏకంగా చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి బోర్డు తగిలించారు. ఈ గ్రామంలో 35 కుటుంబాలు ఉండగా ఆదివాసి కోలాo తెగ గిరిజనులు కఠినంగా నియమ నిష్టలు పాటించడం ఆన వాయితీగా వస్తోంది. నాగోబా జాతర ఉత్సవాల సందర్భంగా ఈనెల 31 వరకు చెప్పులు లేకుండానే తమ ఊరికి రావాలని కుల పెద్దలు తీర్మానం చేయడం గమనార్హం.

ఆ ఊరికి వెళ్లే జనం చెక్ పోస్ట్ వద్ద బోర్డు చూసి చెప్పులు అక్కడే వదిలి ఊరికి వెళ్లి వస్తున్నారు. మరోవైపు ఈనెల 28 న జరిగే నాగోబా జాతర ఉత్సవాలో కోళ్లు, మేకలు, జంతు బలి నిషేధించినట్టు కెస్లాపూర్ నాగోబా ఆలయ కమిటీ తీర్మానించడం కోసం మెరుపు.

Advertisement

తాజా వార్తలు

Advertisement