Monday, June 24, 2024

Adilabad – వరుణ దేవా… కరుణించవా.. కప్ప తల్లికి రైతుల పూజలు


ఆంధ్రప్రభ బ్యూరో -ఆదిలాబాద్ : మృగశిర కార్తె ప్రవేశించి పక్షం రోజులు గడిచినా వ‌ర్షాల‌ జాడ లేక రైతులు దిగులు చెందుతున్నారు. ఆదిలాబాద్ , ఆసిఫాబాద్ ఏజెన్సీ ఏరియాలో వర్షాలు లేక‌పోవ‌డంతో రెండోసారి విత్తనాలు నాటేందుకు రైతులు సిద్ధపడుతున్నారు. పలు గ్రామాల్లో వరుణ దేవుని కటాక్షం కోసం సంప్రదాయ పూజలు, దేవాలయాల్లో భజనలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బేల మండలంలో వర్షాలు కుర‌వాల‌ని, పత్తి విత్తనాలు మొలకెత్తాలని కోరుతూ మంగళవారం కప్ప తల్లి ఆట పేరిట సంప్రదాయ పూజలు నిర్వహించారు.

- Advertisement -

విఘ్నేశ్వరుని ఆలయంలో రోకలికి దుస్తుల‌తో క‌ప్ప‌ను క‌ట్టి వరుణ దేవుని అవతారంగా నీళ్లు చల్లుతూ పసుపు కుంకుమ, నైవేద్యాలు సమర్పించి పూజలు చేశారు. అనంతరం నగర సంకీర్తన చేశారు. అనంత‌రం ఊరు చివరలోని వాగులో క‌ప్ప‌ను విడిచి పెట్టారు. ఈ సంద‌ర్భంగా వ్యాపారుల సహకారంతో అన్నస‌మారాధ‌న‌ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement