Sunday, January 19, 2025

Adilabad – లోయలో పడిన బస్సు – ఇద్దరు మృతి

అదిలాబాద్ జిల్లాలో జరిగినరోడ్డు ప్రమాదంలో ఇద్దరు భక్తులు అక్కడికక్కడే మృతి చెందగా..మరో 47 మంది యాత్రికులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడి హాత్నూర్ మండలం సూర్యగూడకు చెందిన 60 మంది యాత్రికులు వాహనంలో కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కెరిమెరిలోని జంగుబాయి ఆలయానికి వెళ్తుండగా.. అదిలాబాద్ జిల్లాలోని నార్నూర్ మండలం మాలెపూర్ ఘాట్ లో వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి లోయలో పడింది.

వాహనంలో ప్రయాణిస్తున్న 47 మంది యాత్రికులకు తీవ్ర గాయాలు కాగా, ఇద్దరు స్పాట్ లోనే మరణించారు. మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారందరినీ రిమ్స్, ఉట్నూర్, నార్నూర్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొద్ది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement