Wednesday, January 29, 2025

Adilabadలో రైతుల‌ మ‌ర‌ణ మృదంగం .. వారం రోజులలో నలుగురు అన్నదాతల బలవన్మరణం

నేడు మ‌రో రైతు బ‌ల‌వ‌న్మ‌ర‌ణం
వారం రోజుల‌లోనే నలుగురు అన్న‌దాత‌ల బ‌ల‌వ‌న్మ‌ర‌ణం

అదిలాబాద్ జిల్లాలో రైతుల ఆత్మహ‌త్య‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి.. ఈ వారంలో ఇప్ప‌టికే ముగ్గురు అన్న‌దాత‌లు బ‌ల‌వ‌న్మ‌ర‌ణం చెంద‌గా తాజాగా మరో రైతు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు . జిల్లాలోని బజార్‌హత్నూర్ మండలం వర్తమన్నూర్‌కు చెందిన మామిళ్ల నర్సయ్య (55) అప్పుల బాధతో తన వ్యవసాయ భూమి సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకుని మ‌ర‌ణించాడు.. రుణమాఫీ అవ్వక, పంట కోసం చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపంతో ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. తనకున్న ఆరు ఎకరాల్లో పత్తి, కంది పంటలు సాగుచేశాడని, దిగుబడులు సరిగా రాకపోవడంతో నష్టపోయాడని స్థానికులు తెలిపారు. అతనికి ఇచ్చోడ ఎస్‌బీఐలో రూ.2.20 లక్షల అప్పుతోపాటు మరో రూ.3 లక్షల వరకు బాకీలు ఉన్నాయని వెల్లడించారు.

- Advertisement -

రైతుల మ‌ర‌ణ‌మృదంగాల‌కు అంతం ఎప్పుడు – హ‌రీశ్ రావు

ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలో రైతు మామిళ్ళ నరసయ్య అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విచారకరమని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే గడిచిన వారం రోజుల్లో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. రైతుల మరణ మృదంగం జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఏం చేస్తున్నట్లు? అని సీరియస్ అయ్యారు

ఆత్మహత్యలు వద్దు.. బతికుండి కొట్లాడుదాం..కాంగ్రెస్ పాలనలో రైతన్నకు భరోసా లేక మనోధైర్యం కోల్పోతున్నారని, అందరికీ అన్నం పెట్టే అన్నదాతకు కాంగ్రెస్ పార్టీ సున్నం పెడుతున్నదని విమర్శించారు. నమ్మి ఓటేసిన పాపానికి నట్టేట ముంచి, నమ్మక ద్రోహం చేస్తున్నదని తీవ్ర ఆరోపణలు చేశారు. రుణమాఫీ పూర్తి చేసినట్లు రంకెలేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. అప్పులు తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతున్న రైతులకు ఏమని సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ఆ రైతు కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement