ఆంధ్రప్రభ స్మార్ట్, ఆదిలాబాద్ : తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో సీఎం దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించిన ఘటనను సర్కారు సీరియస్ గా పరిగణించింది. 30 యాక్ట్ నిషేదాజ్ఞలు ఉల్లంఘించి నిరసన ర్యాలీ నిర్వహించినందుకు కేసు నమోదు చేసినట్టు డిఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. సీఎంను కించపరిచే విధంగా శవయాత్ర నిర్వహించారని, అనుమతి లేకుండా నిరసన ర్యాలీలు నిర్వహించరాదని ఆయన తెలిపారు.
రైతులపై కేసులు దుర్మార్గం : ఎమ్మెల్యే అనిల్ జాదవ్
రుణమాఫీ తో ప్రభుత్వం రైతులను మోసగించేదిలా ఉందని ఎమ్మెల్యే అనిల్ యాదవ్ అన్నారు. సోమవారం రు య్యాడి గ్రామాన్ని సందర్శించి రైతులకు సంఘీభావం ప్రకటించారు. 60 శాతం మంది రైతులకు రుణమాఫీ సొమ్ము జమ కాలేదని, రైతులు శాంతియుతంగా నిరసన నిర్వహిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతున్నారని ఆరోపించారు. రైతుల సమస్యను పరిష్కరించకుండా సర్కారు నియంతలా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. పోలీసులు పెట్టిన కేసులు ఎత్తివేకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. మాజీ మంత్రి హరీష్ రావు రుయ్యాడి రైతులపై కేసులను తీవ్రంగా ఖండించారు.