సికింద్రాబాద్, ( ప్రభ నూస్) : జలమండలి ద్వారా నెలకు 20వేల కిలో లీటర్ల మేరకు ఉచితంగా మంచినీటి సదుపాయాన్ని పొందేందుకు పౌరులు ఆధార్ తో తమ వివరాలను అనుసంధానం చేసుకోవాలని ఉప సభాపతి తిగుళ్ల పద్మారావు గౌడ్ సూచించారు. ఈ ప్రక్రియను చేపట్టేందుకు ఈనెల 31వ తేదీకి తుది గడువు విధించినందున ప్రజలు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని తీగుల్ల పద్మారావు గౌడ్ శుక్రవారం సూచించారు. సికింద్రాబాద్ పరిధిలోని అడ్డగుట్ట, తార్నాక, మెట్టుగూడ, సీతాఫలమండీ, బౌద్ధనగర్ మునిసిపల్ డివిజన్లలో ఆయా ప్రాంతాల జలమండలి అధికారులు ఈ ఆధార్ లింకేజ్ ప్రక్రియను ముమ్మరంగా నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. తమ క్యాన్ నెంబరును ఆధార్ తో సులభంగానే అనుసంధానం చేసుకోవచ్చునని, వివరాలకు సమీపంలోని జలమండలి కార్యాలయంలో కానీ, టెలిఫోన్ నెంబరు 155 313 ద్వారా కానీ సంప్రదించాలని పద్మారావు గౌడ్ సూచించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital