Tuesday, November 26, 2024

రైత‌న్న‌ల శ్ర‌మైక సౌంద‌ర్యానికి చిరునామా ఉగాది : నామా

ఎంపీ నామా నాగేశ్వరరావు తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు తెలుగు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్ర‌పంచ‌మంతా జ‌న‌వ‌రి 1న కొత్త సంవ‌త్స‌ర వేడుక‌లు జ‌రుపుకుంటే, తెలుగు ప్ర‌జానీకం మాత్రం పంట‌లు కోత‌కు వ‌చ్చే వేళ కొత్త సంవ‌త్స‌రాన్ని ఉగాదిగా జ‌రుపుకుంటార‌ని వివరించారు. ఆరుగాలం క‌ష్టించిన రైత‌న్నల పంట చేతికి వ‌చ్చిన వేళ‌నే మ‌నం పండ‌గ జ‌రుపుకోవ‌డమంటే శ్రమైక సౌంద‌ర్యాన్ని గుర్తించ‌డ‌మేన‌ని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సంద‌ర్భంగా నామా శుభ‌కృత్ నామ ఉగాది శుభాకాంక్ష‌లు చెప్పారు.

టీఆర్ఎస్ స‌ర్కారు చేపట్టిన చర్యల వల్ల రాష్ట్రంలో పెద్దఎత్తున వ‌డ్లు పండి, అతిత‌క్కువ స‌మ‌యంలోనే దేశంలో ధాన్యాగారంగా పేరుగాంచింద‌ని గుర్తు చేశారు. అన్నదాతలు ఎంతో శ్ర‌మ‌కోర్చి పండించిన పంట‌ను కేంద్ర ప్ర‌భుత్వం బాధ్య‌తగా కొన‌కుండా ఉద్దేశపూర్వకంగా నిర్ల‌క్ష్యం ప్రదర్శిస్తోందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అన్న‌దాత‌ల స‌మ‌స్య‌ల‌పై తాను పోరాడుతూ ఉంటాన‌ని నామా నాగేశ్వరరావు పున‌రుద్ఘాటించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement